Anushka : కథ నచ్చి అనుష్క బాహుబలి సినిమాలో నటించలేదా.. ఎందుకు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

అపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి ( Rajamouli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తన సినిమాల ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో అందరికీ పరిచయం చేశారు.

 Anushka Did Baahubali Just For That Not Because She Liked My Story Jakkanna-TeluguStop.com

ఇలా దర్శకుడిగా ఎంతో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి జక్కన్న దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో బాహుబలి ( Baahubali ) కూడా ఒకటి.

Telugu Anushka, Baahubali, Prabhas, Rajamouli, Rama Rajamouli, Rana, Tollywood,

బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ఈ సినిమా ద్వారా ప్రభాస్ అనుష్క వంటి వారందరికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) కి జోడిగా అనుష్క ఎంతో అద్భుతంగా నటించారు.

అనుష్క ( Anushka ) ఒక సినిమాకు కమిట్ అయింది అంటే ఆ సినిమాపై నమ్మకంతోనే కమిట్ అవుతూ ఉంటారు కానీ బాహుబలి సినిమా విషయంలో అలా జరగలేదట.

Telugu Anushka, Baahubali, Prabhas, Rajamouli, Rama Rajamouli, Rana, Tollywood,

ఈమెకు కథ నచ్చి ఈ సినిమాలో భాగం కాలేదు అంటూ తాజాగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాలను వెల్లడించారు.ఇదివరకే రాజమౌళి దర్శకత్వంలో అనుష్క రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు( Vikramarkudu ) సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ప్రభాస్ కూడా చత్రపతి సినిమాలో నటించారు.ఈ విధంగా ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా రాబోతుంది అనే విషయం తెలియగానే అనుష్క కూడా ఈ సినిమాలో భాగమయ్యారట.

ఈ సినిమా కథ ఏంటి అనే విషయం కూడా తాను వివరించలేదు అసలు రెమ్యూనరేషన్ ఎంత అని కూడా తాను ఏమీ మాట్లాడలేదు కానీ అనుష్క మాత్రం ఈ సినిమాలో భాగమయ్యారు.ఇలా కథ రెమ్యూనరేషన్ ఏవి మాట్లాడకుండా అనుష్క ఈ సినిమాలో నటించడానికి కారణం మరేది లేదు.

ప్రభాస్ రానా, రమ, వల్లి కీరవాణి గారు వీళ్లంతా సినిమా చేస్తున్నారు అంటే అది సినిమా లాగా ఉండదని ఒక వెకేషన్ లాగ ఉంటుందని వారందరితో గడపడం చాలా సరదాగా ఉంటుంది ఇలాంటి అవకాశాన్ని తాను ఎందుకు మిస్ చేసుకుంటాను అన్న ఉద్దేశంతోనే అనుష్క ఈ సినిమాలో నటించింది అంటూ రాజమౌళి తెలిపారు.

Telugu Anushka, Baahubali, Prabhas, Rajamouli, Rama Rajamouli, Rana, Tollywood,

ఇలా మేమంతా ఒక సినిమాలో భాగమైతే ఆ సినిమా షూటింగ్ సినిమా షూటింగ్ లా కాకుండా ఒక వెకేషన్ లాగా ఉంటుందన్న ఉద్దేశంతోనే అనుష్క ఈ షూటింగ్లో భాగమయ్యాను అంటూ స్వయంగా ఆమె ఒక సందర్భంలో తనతో చెప్పారని రాజమౌళి ఈ సందర్భంగా అనుష్క బాహుబలి సినిమాలో నటించడం గురించి వెల్లడించారు.ఏమైనా ప్రభాస్ అనుష్క ఇలా బాహుబలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ఉంది అంటూ కూడా అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube