'దేవర' : అక్కడి నుంచి వచ్చిన ఎన్టీఆర్‌ ఇక్కడ మొదలు..!

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం దేవర( Devara ). ఈ సినిమా పై అంచనాలు అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

 Ntr And Koratala Siva Devara Movie Shooting Update,koratala Siva,ntr,devara,deva-TeluguStop.com

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ను దర్శకుడు కొరటాల శివ భారీ బడ్జెట్‌ తో రూపొందిస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా కథ ను సింగిల్ పార్ట్‌ లో చూపించడం సాధ్యం అవ్వడం లేదు.

అందుకే ఈ సినిమా ను ఏకంగా రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అంటూ కొరటాల శివ( Koratala Siva ) అధికారికంగా ప్రకటించిన తర్వాత కొంత మంది ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింతగా పెరిగింది.వచ్చే ఏడాది సమ్మర్ ఆరంభం లో దేవర 1 విడుదల అవ్వబోతుంది.

Telugu Devara, Janhvi Kapoor, Koratala Siva-Movie

ఇక మొన్నటి వరకు గోవా( Goa ) లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారు.దాదాపు రెండు వారాల పాటు అక్కడ చిత్రీకరణ చేసిన యూనిట్‌ సభ్యులు ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా గోవా షెడ్యూల్‌ అవ్వగానే హైదరాబాద్ లో మొదలు పెట్టారు.హైదరాబాద్‌ షెడ్యూల్‌ లో ఎన్టీఆర్ తో పాటు కొంత మంది కీలక నటీ నటులు కనిపించబోతున్నారు.మొత్తానికి ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివ గ్యాప్ లేకుండా వరుసగా సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ను నిర్వహిస్తూ అందరికి కూడా షాక్ ఇస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో సినిమా యొక్క షూటింగ్ ను ముగించాల్సి ఉందట.

Telugu Devara, Janhvi Kapoor, Koratala Siva-Movie

ఎందుకంటే ఎన్టీఆర్‌ జనవరి నుంచి హిందీ చిత్రం వార్‌ 2( War 2 ) లో నటించాల్సి ఉంది.ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి.ఆలస్యం చేస్తే చాలా నష్టం జరుగుతుంది.

అందుకే దేవర ఈ హడావుడి అంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఎన్టీఆర్ మరియు జాన్వీ కాంబోలో రెండు పాటలను వచ్చే నెలలో విదేశాల్లో చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube