అమెరికా : సెనేట్ , అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయులు.. చట్టసభల్లోకి మరో 10 మంది

అమెరికన్ రాజకీయాల్లో భారతీయుల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అక్కడ ఏ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా భారతీయులు( Indians ) ఎవరో ఒకరు ఖచ్చితంగా విజయం సాధిస్తూనే వుంటారు.

 10 Indian-americans Win State And Local Elections In Us Details, Indian-america-TeluguStop.com

తాజాగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో జరిగిన స్థానిక, రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో పది మంది భారత సంతతి నేతలు విజయం సాధించారు.వీరిలో మెజారిటీ నేతలు డెమొక్రాట్లు( Democrats ) కావడం గమనార్హం.

అమెరికా జనాభాలో ఒక శాతంగా వున్న భారతీయులు .రాజకీయాల్లో ప్రబల శక్తిగా మారుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

వర్జీనియాలో.హైదరాబాద్‌కు చెందిన గజాలా హష్మీ( Ghazala Hashmi ) వరుసగా మూడోసారి రాష్ట్ర సెనేట్‌కు తిరిగి ఎన్నికయ్యారు.వర్జీనియా రాష్ట్ర చట్టసభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళగా, అందులోనూ ముస్లింగా ఆమె చరిత్ర సృష్టించారు.మరో నేత సుహాస్ సుబ్రమణ్యం( Suhas Subramanyam ) కూడా వర్జీనియా సెనేట్‌కు తిరిగి ఎన్నికయ్యారు.2019, 2021లో రెండు పర్యాయాలు ఆయన ప్రతినిధుల సభకు ఎన్నియ్యారు.మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో వైట్‌హౌస్‌లో సాంకేతిక విధాన సలహాదారుగా ఆయన పనిచేశారు.

హ్యూస్టన్‌లో జన్మించిన సుబ్రమణియన్ వర్జీనియా హౌస్‌కు ఎన్నికైన తొలి హిందువుగా చరిత్ర సృష్టించారు.

Telugu Democrats, Ghazala Hashmi, Indians, Jersey Senate, Vin Gopal-Telugu NRI

విన్ గోపాల్( Vin Gopal ) న్యూజెర్సీ స్టేట్ సెనేట్‌కు మూడోసారి ఎన్నికయ్యారు.38 ఏళ్ల ఈ డెమొక్రాట్ సెనేటర్ మంగళవారం న్యూజెర్సీలోని 11వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో తన సమీప రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్ధి స్టీవ్ డ్నిస్ట్రియన్‌ను ఓడించారు.పోలింగ్‌లో గోపాల్‌కు దాదాపు 60 శాతం ఓట్లు వచ్చాయి.

విన్ గోపాల్ ప్రస్తుతం న్యూజెర్సీ స్టేట్ సెనేట్‌లో( New Jersey State Senate ) అతి పిన్న వయస్కుడైన సభ్యుడిగా, రాష్ట్ర చరిత్రలో సెనేట్‌కు ఎన్నికైన తొలి దక్షిణాసియా వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.అమెరికాలోని దాదాపు 37 రాష్ట్రాల్లో వివిధ ఎన్నికలు జరిగాయి.

Telugu Democrats, Ghazala Hashmi, Indians, Jersey Senate, Vin Gopal-Telugu NRI

గోపాల్ 2017లో తొలిసారిగా సెనేట్‌కు ఎన్నికయ్యారు.తర్వాత 2021లో రెండోసారి విజయం సాధించారు.గోపాల్ ప్రస్తుతం సెనేట్ ఎడ్యుకేషన్ కమిటీకి అధ్యక్షుడిగా. సెనేట్ మెజారిటీ కాన్ఫరెన్స్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు.గతంలో సెనేట్ మిలిటరీ, వెటరన్స్ అఫైర్స్ కమిటీకి ఛైర్‌గానూ పనిచేశారు.సెనేట్ గవర్నమెంట్, టూరిజం అండ్ హిస్టారిక్ ప్రిజర్వేషన్ కమిటీకి వైస్ ఛైర్‌గా.

హెల్త్ , మానవ సేవలు, సీనియర్ సిటిజన్స్ కమిటీలో సభ్యుడిగానూ సేవలందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube