సిరియాలో అమెరికా వైమానిక దాడులు.. ప్రతీకార చర్యగా ఆ గ్రూప్ ఫెసిలిటీ టార్గెట్..

ఇరాక్, సిరియాలో( Iraq, Syria ) యూఎస్ దళాలపై ఇటీవల దాడులు జరిగిన సంగతి తెలిసిందే.దానికి ప్రతీకారంగా అమెరికా తాజాగా వైమానిక దాడికి పాల్పడింది.

 Us Airstrikes In Syria The Group's Facility Was Targeted As A Revenge , U.s. Air-TeluguStop.com

ఇరాన్ మద్దతుగల మిలీషియాలు ఉపయోగించే సౌకర్యాన్ని టార్గెట్‌గా చేసుకుంటూ యూఎస్ మిలిటరీ సిరియాలో ఎయిర్ స్ట్రైక్ లాంచ్ చేసింది.యూఎస్ సెంట్రల్ కమాండ్ ( USCENTCOM ) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌లో దాడి గురించి ప్రకటించింది.

తూర్పు సిరియాలోని వెపన్స్ స్టోరేజ్ ఫెసిలిటీపై రెండు యూఎస్ ఎఫ్-15 విమానాల ద్వారా ఈ దాడి జరిగిందని పేర్కొంది.ఈ సదుపాయం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ( IRGC ), దాని అనుబంధ సంస్థలకు చెందినది, వీరు గతంలో యూఎస్ సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు.

Telugu Iranbacked, Biden, Syria, Airstrike, Uscentcom-Telugu NRI

యూఎస్ ప్రజలు, ప్రయోజనాలను రక్షించడానికి ఈ స్ట్రైక్ ఒక రక్షణాత్మక చర్యగా కండక్ట్ చేశామని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.యూఎస్ రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ స్ట్రైక్ ( Secretary of Defense Lloyd Austin Strike )ధృవీకరించారు.అధ్యక్షుడు బైడెన్( Biden ) చేత ఈ దాడికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పేర్కొన్నారు.స్ట్రైక్ ఆత్మరక్షణ చర్య అని, తమ సిబ్బంది భద్రత కంటే అమెరికాకు ఎక్కువ ప్రాధాన్యత లేదని ఆయన స్పష్టం చేశారు.

అవసరమైతే తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా అమెరికా సిద్ధంగా ఉందని చెప్పారు.ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా వారి దాడులను ఆపాలని ఆయన కోరారు.ఇరాక్, సిరియాలో యూఎస్ కౌంటర్ ISIS మిషన్లను నిర్వహిస్తుందని చెప్పారు.

Telugu Iranbacked, Biden, Syria, Airstrike, Uscentcom-Telugu NRI

అక్టోబరు 17, నవంబర్ 7 మధ్య ఇరాన్-మద్దతుగల మిలీషియాలచే యూఎస్ దళాలు కనీసం 40 దాడులను ఎదుర్కొన్నాయని పెంటగాన్ తెలిపింది.ఈ దాడులలో ఇరాక్, సిరియాలోని యూఎస్ స్థావరాలు, సిబ్బంది, సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్న రాకెట్, డ్రోన్ దాడులు ఉన్నాయి.కొన్ని దాడుల ఫలితంగా యూఎస్ దళాలలో కొందరు చనిపోయారు.

మరికొందరికి గాయాలయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube