కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ లో తీవ్ర కలకలం చెలరేగింది.టికెట్ రాలేదని నియోజకవర్గ నేత కాసుల బాలరాజు బలవన్మరణానికి యత్నించారు.
బాన్సువాడ స్థానం నుంచి టికెట్ ఆశించిన బాలరాజు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.అయినా పార్టీ అధిష్టానం స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఈ క్రమంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.వెంటనే గమనించిన పార్టీ కార్యకర్తలు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.







