Kriti Shetty : సినిమాలలోకి రాకముందు కృతి శెట్టి జాబ్ ఏంటో తెలుసా… అంత శాలరీ తీసుకునేదా?

ఉప్పెన సినిమా( Uppena ) ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నటి కృతి శెట్టి( Kriti Shetty ) .ఇలా మొదటి సినిమాతోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు అనంతరం వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి అయితే కృతి శెట్టి నటించిన తదుపరి రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి.

 Latest News About Kriti Shetty-TeluguStop.com

ఇలా ఈమె నటించిన సినిమాలు మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించే అవకాశాలు వచ్చాయి.అయితే ఈమె తదుపరి వరుస సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగలడంతో ప్రస్తుతం అవకాశాలు కూడా కాస్త తగ్గుతూ వచ్చాయి.

చివరిగా నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ ( Custody ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా వచ్చినటువంటి కృతి శెట్టి తదుపరి సినిమా శర్వానంద్ తో చేస్తున్న సంగతి తెలిసిందే ఇలా కెరియర్ పరంగా పలు సినిమాలలో నటిస్తూ కృతి శెట్టి ఒకవేళ హీరోయిన్గా ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే ఏం చేసేవారు అన్న సందేహం కూడా అందరిలోనూ నెలకొంది.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ అడిగే ప్రశ్నలకు ఈమె ఆసక్తికరమైనటువంటి సమాధానాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నిస్తూ మీ మొదటి జాబ్ ఏంటి? అసలు ఎంత శాలరీ తీసుకున్నారు అనే ప్రశ్న వేశారు.తన ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటే సినిమాకు తీసుకున్నది కాదు మీరు చేసిన పనికి ఇచ్చిన శాలరీ ఎంత అని ప్రశ్నించడంతో కృతి శెట్టి సమాధానం చెప్పారు.తాను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ చెప్పే గ్రోసరి ఐటమ్స్ అన్ని కూడా నేను షాప్ కి వెళ్లి తీసుకువచ్చేదాన్ని ఇదే నా ఫస్ట్ జాబ్ ఈ జాబ్ చేసినందుకు మమ్మీ నాకు 100 లేదా 150 ఇచ్చేదని ఇదే నా ఫస్ట్ జాబ్ ఫస్ట్ సాలరీ అంటూ ఈ సందర్భంగా కృతి శెట్టి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక కృతి శెట్టి ప్రస్తుతం శర్వానంద్( Sharwanand ) తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇక ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అనంతరం వరుస సినిమాలలో నటించే అవకాశాలు అందుకోవడంతో ఇండస్ట్రీకి ఈమె ఒక గోల్డెన్ లెగ్ అంటూ పెద్ద ఎత్తున కురిపించారు.ఇక తదుపరి సినిమాలన్నీ కూడా డిజాస్టర్ కావడంతో ఈమె పట్ల భారీ స్థాయిలోనే విమర్శలు కూడా వచ్చాయి.అలాగే ఈమె మెగా ఇంటికి కోడలు కూడా కాబోతుంది అంటూ తన గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.

కానీ తన గురించి వచ్చే అవాస్తవాలు అన్నింటిని కూడా కృతి శెట్టి ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంటారు.

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=5SVze0&v=1113665415885345
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube