గ్యాస్ ఫుల్లుగా పట్టేసిందా.. ఈ డ్రింక్‌ తాగితే రెండు నిమిషాల్లో రిలీఫ్ పొందుతారు!

మనం సర్వ సాధారణ ఫేస్ చేసే సమస్యల్లో గ్యాస్( Gas ) ఒకటి.ముఖ్యంగా మసాలా ఫుడ్స్ ను కొంచెం ఎక్కువ తిన్నామంటే చాలు ఫుల్ గా గ్యాస్ పట్టేస్తుంటుంది.

 Best Drink To Relieve Gas Problem In Just 2 Minutes , Gas Relief Drink , La-TeluguStop.com

ఇది చిన్న సమస్యే అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యానికి గురిచేస్తుంది.కడుపు ఉబ్బరంగా మారిపోతుంది.

ఆయాసం విపరీతంగా వస్తుంది.గ్యాస్ సమస్య వల్ల ఏ పని చేయలేకపోతుంటారు.

అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగితే కేవలం రెండు నిమిషాల్లో రిలీఫ్ పొందుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వాటర్ ఏంటో.

ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం ప‌దండి.

Telugu Gas Problem, Gas, Gastric Problem, Tips, Latest-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక‌టిన్న‌ర గ్లాస్‌ వాటర్ పోసుకోవాలి.వాట‌ర్ కాస్త హీట్ అవ్వగానే ఒక చమోమిలే టీ బ్యాగ్ ను అందులో వేసుకోవాలి.అలాగే వన్‌ టేబుల్ స్పూన్ అల్లం తురుము,( Ginger )వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు,( Fennel Seeds ) నాలుగు ఫ్రెష్ పుదీనా ఆకులు ( Mint Leave )వేసి మరిగించాలి.దాదాపు పది నిమిషాల పాటు మరిగిస్తే మ‌న డ్రింక్ రెడీ అవుతుంది.

అప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తరువాత సేవించాలి.

Telugu Gas Problem, Gas, Gastric Problem, Tips, Latest-Telugu Health

గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ డ్రింక్ తాగితే చాలా వేగంగా రిలీఫ్ లభిస్తుంది.గ్యాస్ క్షణాల్లో మాయం అవుతుంది.అలాగే ఈ డ్రింక్ అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలను తరిమి తరిమి కొడుతుంది.

మలబద్ధకం సమస్యను సైతం నివారిస్తుంది.నిత్యం గ్యాస్ సమస్యతో బాధపడేవారు రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ ను తీసుకుంటే చాలా మంచిది .ఈ డ్రింక్ జీర్ణ‌ వ్యవస్థ( Digestive ) పని తీరును మెరుగుపరుస్తుంది.జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.

పైగా ఈ డ్రింక్ ను రోజు తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.థైరాయిడ్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది.

మ‌రియు రక్తంలో చక్కెర స్థాయిలో సైతం నియంత్రణలో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube