వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నవంబర్ 7న జరిగిన ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ ( Australia Afghanistan )మ్యాచ్ చివరి వరకు చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారీ పరుగుల తేడాతో విజయం సాధిస్తుందని అంతా భావించారు.
ఆస్ట్రేలియా జట్టు కూడా గెలుపు ఆఫ్ఘన్ జట్టుదే అని అనుకుంది.ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు మ్యాక్స్ వెల్ క్రీజులోకి వచ్చాడు.
ఏకంగా రెండుసార్లు మ్యాక్స్ వెల్ కు అదృష్టం వరించింది.ఒకటి ఎల్బీడబ్ల్యూ, రెండవది క్యాచ్ మిస్.
దీంతో మ్యాక్స్ వెల్ ఆచి తూచి ఆడుతూ చివరి వరకు క్రీజులో నిలబడే ప్రయత్నం చేసి సఫలం అయ్యాడు.

ప్రత్యర్థి బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.సమయం దొరికినప్పుడల్లా ఫోర్లు సిక్సర్లతో చెలరేగి ఆస్ట్రేలియా జట్టును విజయం వైపు నడిపించి చివరకు సెమీ ఫైనల్ కు చేర్చాడు.ఆస్ట్రేలియా జట్టు 93 పరుగులకు ఏకంగా ఏడు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ 128 బంతుల్లో 201 పరుగులు చేశాడు.
మ్యాక్స్ వెల్( Glenn Maxwell )ఒంటి చేత్తో డబుల్ సెంచరీ చేసి ఎన్ని రికార్డులను బద్దలు కొట్టాడో చూద్దాం.వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా మ్యాక్స్ వెల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

200 కు పైగా పరుగులు చేసిన తొలి నాన్ ఓపెనర్ గా ఓ అరుదైన రికార్డును మ్యాక్స్ వెల్( Glenn Maxwell ) సృష్టించాడు.జట్టులో ఐదవ స్థానం లేదా ఆ తరువాత స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్ గా కూడా మ్యాక్స్ వెల్ సరికొత్త చరిత్రని సృష్టించాడు.సాధారణ పరిస్థితులలో పరుగులు ఏ ఆటగాడైనా చేస్తాడు కానీ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ఒత్తిడిని తట్టుకొని ప్రత్యర్థులను సమర్ధవంతంగా కట్టడి చేసి భారీ పరుగులు చేసేవారు చాలా కొద్ది మందే ఉంటారు.ఇందులో ఒకటిగా ఆస్ట్రేలియా ప్లేయర్ మ్యాక్స్ వెల్ తాజాగా చేరాడు.







