తెలంగాణ లో ఈ నెల 30 వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలను హోరెత్తిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బీజేపీ పార్టీ( BJP party ) ఎల్బీ స్టేడియం లో భారీ బహిరంగ సభ ని నిర్వహించింది.
ఈ సభ కి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక అతిథి గా పాల్గొన్నాడు.బీసీ మహాసభ గా పిలవబడిన ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ని ఉద్దేశించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు హైలైట్ గా నిలిచాయి.
అయితే కేవలం మోడీ గారిని పొగడ్తలకే పరిమితం చేసిన పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, ఆ పార్టీ అధినేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ మీద కానీ ఒక్క విమర్శ కూడా చెయ్యకపోవడం విశేషం.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మోడీ గురించి మాట్లాడుతూ ‘ ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ) గారు ఎన్నికలే లక్ష్యంగా పనిచేసి ఉంటే ఆర్టికల్ 370 రద్దు చేసేవారు కాదు,ట్రిపుల్ తలాక్ రద్దు చేసేవారు కాదు,మహిళా బిల్లు తీసుకు వచ్చేవారు కాదు,రామ మందిరం నిర్మించేవారు కాదు,నోట్ల రద్దు చేసేవారు కాదు,ఆయన ఎప్పుడూ దేశ ప్రయోజనాలే తప్ప, ఎన్నికల కోసం పనిచేయలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.ఇంకా ఆయన మాట్లాడుతూ ‘జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్, సౌభాగ్య యోజన, ఉజ్వల యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మన్ యోజన, అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్, PM ఆవాస్ యోజన లాంటి పథకాలు దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.ఈ సభలో పవన్ కళ్యాణ్ ని నరేంద్ర మోడీ ఎంతో గౌరవం ఇచ్చాడు.
ఆయన గురించి ప్రత్యేకంగా ప్రసంగం కూడా ఇచ్చాడు.ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.

నరేంద్ర మోడీ మాట్లాడుతూ ‘నా వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు.గతం లో కూడా ఆయన మాకు ఎంతో సంపూర్ణ మద్దతు ఇచ్చాడు.ఇప్పుడు కూడా ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసమే నిరంతరం పరితపించే వ్యక్తి’ అంటూ ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి ఇలా పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా ట్రీట్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అంతే కాదు వేదిక మీద నరేంద్ర మోడీ చాలా సేపు పవన్ కళ్యాణ్ తో గుసగుసలు ఆడారు.ఏమి మాట్లాడుకొని ఉంటారు అని ఇప్పుడు అభిమానులు ఆరాలు తియ్యడం మొదలు పెట్టారు.







