నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లిన కోమటిరెడ్డి నామినేషన్ వేశారు.
అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడిన ఆయన కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదని తెలిపారు.బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తరువాత కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటో ఆలోచించాలని సూచించారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.ఈ క్రమంలోనే ఏదో ఒకరోజు తాను సీఎం అవుతానని వెల్లడించారు.