అంతర్జాతీయ క్రికెట్( International cricket ) లో నియమ నిబంధనలు చాలా ఎక్కువ.ఈ నియమ నిబంధనలను ప్రతి ఒక్క ఆటగాడు అనుసరించి క్రికెట్ ఆట కొనసాగించాల్సిందే.
అలా కాకుండా ఏ నిబంధనను ఉల్లంఘించిన భారీ మూల్యం చెల్లించుకోవలసిందే.కొందరు ఆటగాళ్లు రూల్స్( Players rules ) విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అంతర్జాతీయ క్రికెట్ లో చాలానే ఉన్నాయి.
కొంతమంది అనుకోకుండా పొరపాటున రూల్స్ బ్రేక్ చేసి ఊహించని రీతిలో అవుట్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

తాజాగా బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక ( Bangladesh vs Sri Lanka )మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం( Arun Jaitley Stadium ) వేదికగా జరిగిన సంగతి తెలిసిందే.క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శ్రీలంక బ్యాటర్ అరుదైన రీతిలో అవుట్ కావడంతో అందరూ షాక్ అయ్యారు.శ్రీలంక జట్టు ఆల్ రౌండర్ మాథ్యూస్ టైం అవుట్ కారణంగా పెవీలియన్ చేరాడు.
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో బ్యాట్స్ మెన్ అవుట్ అయిన తర్వాత మూడు నిమిషాలలో మరో బ్యాట్స్మెన్ క్రీజులోకి రావలసి ఉంటుంది.అయితే ఈ మూడు నిమిషాల వ్యవధి కాలాన్ని ప్రస్తుతం ఈ వరల్డ్ కప్ లో రెండు నిమిషాలకు కుదించారు.

శ్రీలంక జట్టు బ్యాటర్ అవుట్ అయి రెండు నిమిషాలు గడిచిన మాథ్యూస్ క్రీజులోకి రాకపోవడంతో బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్( Shakib Al Hasan ) అప్పీల్ చేయగా అంపైర్లు టైం అవుట్ కారణంగా ఔట్ ప్రకటించారు.దీంతో మాథ్యూస్ బ్యాటింగ్ చేయకుండానే పెవీలియన్ కు వెళ్లాల్సి వచ్చింది.ఈ ఆసక్తికర సన్నివేశం మైదానంలో ఉండే వారందరినీ ఆశ్చర్యపరిచింది.ఇంటర్నేషనల్ క్రికెట్లో టైం అవుట్ కారణంగా పెవీలియన్ చేరిన తొలి క్రికెటర్ గా మాథ్యూస్ నిలిచాడు.మాథ్యూస్ బ్యాటింగ్ చేయకుండానే పెవీలియన్ చేరడంతో శ్రీలంక క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు.ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు అద్భుతంగా ఛేజింగ్ చేసి మూడు వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.







