తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది.ఈ మేరకు ప్రకాశ్ జవదేకర్, కిషన్ రెడ్డి, మురళీధర్ రావు ఈ ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు.
అనంతరం ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు.ఇటువంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు.
రాష్ట్ర సర్కార్ కాంట్రాక్టర్ కు ప్రాజెక్టును అమ్ముకుందన్నారు.తెలంగాణ ప్రభుత్వ పాలసీల వలన డ్రగ్స్, లిక్కర్ టెర్రరిజంకు చోటు దక్కిందని విమర్శించారు.
కట్టర్ ఇస్లామిక్ టెర్రరిజం మూలాలు తెలంగాణలో ఉన్నాయని ఆరోపించిన ప్రకాశ్ జవదేకర్ మజ్లిస్ అండతో బంగ్లాదేశ్, బర్మా రోహింగ్యాలు పెరుగుతున్నారని విమర్శించారు.ఇటీవలే పీఎఫ్ఐతో లింకులు ఇక్కడ బయటపడ్డాయని తెలిపారు.