వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి బరిలో ఉంటారని ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు.
రెట్టింపు స్థాయిలో కష్టపడి రేవంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు.
ఈనెల 10వ తేదీన రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ వేస్తారని తెలిపారు.నామినేషన్ అనంతరం బహిరంగ సభలో కర్ణాటక సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు.
కామారెడ్డిలో ఉన్న భూములను లాక్కునేందుకే కేసీఆర్ వస్తున్నారని ఆరోపించారు.కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.