బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రస్తుతం 9 వారాలను పూర్తిచేసుకుని పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదవ వారం టేస్టీ తేజ ( Tasty Teja ) హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఈయన మూడవ వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు అంటూ అందరూ భావించారు కానీ 9 వారాలపాటు హౌస్ లో కొనసాగి తొమ్మిదవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు.ఇలా టేస్టీ తేజ ఎలిమినేట్ కావడంతో ఈయన రెమ్యూనరేషన్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినటువంటి తేజ 9 వారాలపాటు హౌస్ లో కొనసాగారు.అయితే తాజాగా ఈయన ఎలిమినేట్ కావడంతో ఈయన రెమ్యూనరేషన్ వార్తలు వైరల్ అవుతున్నాయి .ఈయన బిగ్ బాస్ వెళ్లడానికి ముందు వారానికి 1.5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ( Remuneration ) తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నారంటూ సమాచారం.అయితే 9 వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి తేజ( Tasty Teja ) బిగ్ బాస్ నుంచి 13.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక తేజ ఈ కార్యక్రమానికి రాకముందు పలు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉండేవారు అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఈయనకు ఎంతో మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి.రెమ్యూనరేషన్ పరంగా ఈయన అందుకున్నది చాలా తక్కువ రెమ్యూనరేషన్ అయినప్పటికీ ఈ కార్యక్రమాల ద్వారా ఈయనకు మాత్రం విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పాలి.మరి తొమ్మిది వారాలపాటు హౌస్ లో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినటువంటి తేజకు బిగ్ బాస్ తర్వాత ఇండస్ట్రీలో ఏవైనా అవకాశాలు వస్తాయా? కెరియర్ ఎదుగుదలకు బిగ్ బాస్ ప్రయోజనకరంగా మారుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.







