బుల్లితెరపై పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి కామెడీ షోలలో జబర్దస్త్ (Jabardasth ) కార్యక్రమం ఒకటి.గత దశాబ్ద కాలం పైగా ప్రసారమవుతూ ఈ షో ఎంతో మంది ప్రేక్షకులను సందడిచేస్తుంది.
ఇక ఈ కార్యక్రమం ద్వారా కమెడియన్లుగా పరిచయమైన కొందరు ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు.ప్రస్తుతం కొంతమంది హీరోలుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకోగా మరికొందరు డైరెక్టర్లుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించినటువంటి అనసూయ( Anasuya ) కూడా ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

ఈమెకు సినిమాలలో పెద్ద ఎత్తున అవకాశాలు రావడంతో జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసారు.ఇలా అనసూయ వెళ్ళిపోవడంతో ఈ కార్యక్రమానికి సౌమ్యరావు( Sowmya Rao ) యాంకర్ గా పరిచయమయ్యారు.ఈమె కన్నడ నటి అయినప్పటికీ పలు తెలుగు సీరియల్స్ లో నటిస్తూ నటిగా గుర్తింపు పొందారు.
ఈ క్రమంలోనే ఈమెను జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా పరిచయం చేశారు.అయితే ఈమె కూడా తన యాంకరింగ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అయితే తాజాగా ఉన్నఫలంగా సౌమ్యరావు కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో మరో కొత్త యాంకర్ జబర్దస్త్ కార్యక్రమంలోకి అడుగు పెట్టారు.

మరి జబర్దస్త్ కార్యక్రమానికి కొత్తగా వచ్చిన యాంకర్ ఎవరు అనే విషయానికి వస్తే యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని, అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకొని బిగ్ బాస్ కార్యక్రమంలో టాప్ 5 కంటెస్టెంట్ గా ఉన్నటువంటి సిరి హనుమంత్( Siri Hanumanth) ఈ కార్యక్రమానికి యాంకర్ గా చేసే అవకాశాన్ని అందుకున్నారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమో విడుదల చేయగా, ఈ కార్యక్రమంలో సిరి సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమానికి ఈమె కొత్త యాంకర్ గా పరిచయం కావడంతో జడ్జెస్ అలాగే ఇతర కమెడియన్స్ కూడా ఈమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.







