కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో బండి సంజయ్ చెప్పింది నిజమేనా..?

కాంగ్రెస్ ( Congress ) పార్టీలో ఉన్న చాలామంది నాయకులు అటు ఇటూ అన్నట్లుగా రెండు పడవల ప్రయాణం చేస్తూ ఉంటారు.పార్టీ జోరు మీదుంటే ఈ పార్టీలోకి వచ్చి పడతారు.

 Is What Bandi Sanjay Said About Congress Mlas True , Congress Party , Bandi San-TeluguStop.com

లేకపోతే మరో పార్టీలోకి జంప్ అవుతారు.ఒకవేళ ఎన్నికల్లో మరో పార్టీకి ఎక్కువ లీడింగ్ ఉంటే ఈ పార్టీ నుండి జంప్ అయ్యి ఆ పార్టీలో చేరుతారు.

ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు జరిగింది.అయితే ఆ మధ్య కాలంలో బండి సంజయ్ ( Bandi Sanjay ) కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ పార్టీకే వస్తారని ఎన్నికల రిజల్ట్ వచ్చిన మరునాడు కెసిఆర్ చిటికేస్తే బీఆర్ఎస్ లోకి వచ్చి కూర్చుంటారని,ఇక ఈ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా మాత్రమే కప్పుకొని తిరుగుతున్నారు.

Telugu Bandi Sanjay, Congress, Komativenkat, Revanth Reddy, Telangana, Ts-Politi

కానీ వారి ఎన్నికల ఖర్చు మొత్తం కేసీఆరే ( KCR ) భరిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలను సరఫరా చేసే ఏటీఎం గా మారిపోయింది అంటూ ఎప్పటినుండో బండి సంజయ్ మీడియా ముఖంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య ఉన్న ఈ విషయాన్ని బయటపెట్టిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ విషయం నిజమే అన్నట్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా చేసిన కామెంట్లు అనిపిస్తున్నాయి.

Telugu Bandi Sanjay, Congress, Komativenkat, Revanth Reddy, Telangana, Ts-Politi

తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkat Reddy ) ఒక ప్రముఖ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 59 స్థానాలు వస్తే కచ్చితంగా ఇందులో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోనే ఉంటారు.కానీ 59 స్థానాలకు ఏ ఒక్క సీటు తగ్గినా కూడా పార్టీ నుండి చాలామంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి జంప్ అవుతారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

ఇక కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన కామెంట్లు వైరల్ అవ్వడంతో కాంగ్రెస్ విషయంలో బండి సంజయ్ ( Bandi Sanjay ) ఎప్పటినుండో చెబుతున్న ఆ విషయాలు నిజమేనని అందరూ భావిస్తున్నారు.అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలపై సీఎం అవుతాను అని చెప్పుకుంటూ తిరుగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కే నమ్మకం లేదు.

మేము ఎలా నమ్మాలి అని ప్రజలు చర్చించుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube