Anasuya Adivi Sesh: అడివి శేష్ నాకు లైన్ వేస్తున్నాడని దూరం పెట్టాను… షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ అనసూయ (Anasuya) ఒకరు.ఈమె కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా పనిచేశారు అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా చేశారు.

 Anchor Anasuya Latest Comments About Hero Adivi Sesh-TeluguStop.com

అయితే జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమానికి యాంకర్ గా మారిన సమయంలోనే ఈమెకు ఎంతో వచ్చాయి.ఇలా జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి అనసూయ అనంతరం సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

కెరియర్ పరంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి హాజరైన సంగతి మనకు తెలిసిందే.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా అనసూయ తనకు సినిమా అవకాశాలు రావడం గురించి మాట్లాడారు.తాను మొదట సోగ్గాడే చిన్నినాయన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ నేను మొదట సంతకం చేసిన సినిమా మాత్రం క్షణం సినిమా( Kshanam Movie ) అంటూ ఈ సందర్భంగా అనసూయ తెలియచేశారు.

అడివి శేష్(Adivi Sesh) , అనసూయ ఆదాశర్మ వంటి తదితరులు చేసినటువంటి ఈ సినిమా బాగా మెప్పించింది.

Telugu Adivi Shesh, Anasuya, Anasuya Offers, Anchor Anasuya, Adivi Sesh, Kshanam

ఇందులో అనసూయ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు.ఇక ఈ సినిమా గురించి అనసూయ మాట్లాడుతూ తాను 2013 వ సంవత్సరంలో ఒకసారి అమెరికా( America ) వెళ్లాను అక్కడ శేష్ నన్ను కలిశారు.అప్పట్లో హీరోలు అంటే నాకు ఒక అభిప్రాయం ఉండేది హీరోలు అమ్మాయిలతో మాట్లాడుతున్నారు అంటే కచ్చితంగా వారికి లైన్ వేసి వారిని పడగొట్టడానికి మాట్లాడేవారని నేను భావించేదాన్ని అందుకనే శేష్ నాకు కూడా లైన్ వేస్తాడేమోనని నేను తనని దూరం పెట్టాను అంటూ అనసూయ ఈ సందర్భంగా తెలియజేశారు.

Telugu Adivi Shesh, Anasuya, Anasuya Offers, Anchor Anasuya, Adivi Sesh, Kshanam

ఇలా ఒకసారి కలిసిన తర్వాత అతని నుంచి నేను పక్కకు వెళ్ళిపోయాను అయితే తిరిగి మూడు నెలల తర్వాత అనుకోకుండా ఒక కాఫీ షాప్ లో కలిసాము అప్పుడు ఆయన నాకు ఇష్టం లేకపోయినా ఈ సినిమా కథ( Movie Story ) వినిపించారని తెలియజేశారు.తాను నన్ను జబర్దస్త్ కార్యక్రమంలో ఒక ఎపిసోడ్లో చాలా సీరియస్ లుక్ లో ఉండటం చూశారట ఆ సమయంలోనే నేను ఈ సినిమాలోని పోలీస్ ఆఫీసర్ పాత్రకు( Police Officer Role ) సరిగ్గా సరిపోతానని భావించి నాకోసం వెతకడం ప్రారంభించారని,

Telugu Adivi Shesh, Anasuya, Anasuya Offers, Anchor Anasuya, Adivi Sesh, Kshanam

క్షణం సినిమాలో తాను బాగమయ్యాను అంటూ ఈ సందర్భంగా అనసూయ తెలియచేశారు.మా మహాలక్ష్మి కార్యక్రమానికి యాంకరింగ్ చేయడం చూసి సోగ్గాడే చిన్నినాయన( Soggade Chinninayana ) సినిమాలో అవకాశం కల్పించారు అంటూ ఈ సందర్భంగా అనసూయ తన సినిమాల గురించి తెలిపారు.అయితే తనకు రంగస్థలం సినిమా చేసిన తర్వాత రంగమ్మత్త పాత్ర ద్వారా మరింత గుర్తింపు వచ్చింది అంటూ ఈ సందర్భంగా అనసూయ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube