ఏపీలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్ పాలన కొనసాగుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేవలం ఆయనకు మాత్రమే దక్కుతుంది.
చిన్నారులు నుంచి పండు ముసలి వరకు ఎవరూ ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వారి శ్రేయస్సు, సంక్షేమమే ముఖ్యమని వైసీపీ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది.ఈ క్రమంలోనే వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు సీఎం వైఎస్.
వాటిలో ఒకటి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికీ వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో సీఎం వైఎస్ జగన్ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 30న ప్రారంభమైన ఈ కార్యక్రమం స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో విజయవంతంగా కొనసాగుతుంది.డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లు, వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.అంతేకాదు డాక్టర్లు సూచించిన మందులను సైతం జగన్ ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తోంది.
రాష్ట్రంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం వైఎస్ జగన్ సంకల్పం.కదల్లేని, ఇళ్ల నుంచి బయటకు రాలేని వారి కోసం వైద్య సిబ్బందినే ప్రతి ఇంటికి పంపిస్తున్నారు.
ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పరీక్షలు చేసి అక్కడికక్కడే మందులు ఇస్తారు.అవసరం అయితే పెద్ద ఆస్పత్రికి సైతం పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేల వైద్య శిబిరాలు నిర్వహించగా 60.9 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.అందులో 59.2 లక్షలమందిని వైద్య సిబ్బంది, డాక్టర్లు పరీక్షించారు.ఇప్పటివరకూ 1.44 కోట్ల గృహాలను వైద్య సిబ్బంది సందర్శించి 6.4 కోట్ల పరీక్షలు చేశారు.3.78 కోట్లమందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టారు.అంతేకాదు గ్రామ వార్డు, సచివాలయాల స్థాయిలో 13,930 వరకూ శిక్షణ శిబిరాలు నిర్వహించారు.ఇక 1.38 కోట్ల కుటుంబాలను వార్డు, గ్రామ వాలంటీర్లు సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకుంటున్నారు.జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారానే కాకుండా మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది వైఎస్ జగన్ ప్రభుత్వం.ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ఈ బృహాత్తర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్నారు.