తాజాగా భారత్-దక్షిణాఫ్రికా( India-South Africa ) మధ్య జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చాలా ఘోరంగా ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే.ఈ టోర్నీలో ఆరంభం నుంచి దక్షిణాఫ్రికా దూకుడు చూసి భారత జట్టుకు గట్టి పోటీ ఇస్తుందని అంతా భావించారు.
నెదర్లాండ్స్ చేతిలో తప్ప ఇప్పటివరకు ఏ జట్టు చేతిలోనూ ఓడిపోకుండా వరుస విజయాలతో సౌత్ ఆఫ్రికా అదరకొట్టింది.అయితే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్లో భారత్ కు గట్టి పోటీ ఇచ్చి స్వల్ప పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓడిపోతుంది అనుకుంటే.
అందరి అంచనాలను తారుమారు చేసి ఏకంగా సౌత్ ఆఫ్రికా జట్టు 243 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.

భారత జట్టు సొంత గడ్డపై జరుగుతున్న టోర్నీలలో వరుస విజయాలతో దూసుకుపోతూ తమ జట్టుకు సొంత గడ్డపై తిరుగులేదు అనే విషయాన్ని మరోసారి నిరూపించింది.భారత జట్టు బ్యాటర్లను కట్టడి చేయడంలో దక్షిణాఫ్రికా బౌలర్లు విఫలం అయ్యారు.భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు.
మ్యాచ్ అనంతరం ఓటమిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ బావుమా( Temba Bavuma ) స్పందిస్తూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.భారత గడ్డపై భారత్ ను ఓడించడం అత్యంత కఠిన పరీక్ష అని తనకు ముందే తెలుసు అని చెప్పాడు.
భారత జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉండి ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి అనేది ఎరుగలేదు.అలాంటి జట్టును ఓడించడం అతి పెద్ద సవాలే అని చెప్పుకొచ్చాడు.

తమ దక్షిణాఫ్రికా జట్టు ప్రణాళికలను అమలు చేయడంలో విఫలం అయిందని.ఇక చేజింగ్ లో తాము మెరుగైన ప్రదర్శన చేయలేకపోయామని తెలిపాడు.భారత జట్టు తొలి పవర్ ప్లే లో చాలా దూకుడుగా ఆడింది. విరాట్ కోహ్లీ ( Virat Kohli )సెంచరీ తో అద్భుతంగా రాణించాడు.
కానీ దురదృష్టవశాత్తు తమ దక్షిణాఫ్రికా జట్టు మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేయడంలో విఫలమైంది.ఈ ఓటమిని ఒక గుణపాఠంగా తీసుకుని సెమీ ఫైనల్ మ్యాచ్లో అందుకు తగ్గట్లుగా సిద్ధం అవుతామని బావుమా తెలిపాడు.







