మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఈసారి మళ్లీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్( US Presidential Elections ) బరిలోకి దిగారు.ట్రంప్ త్వరలో జరగనున్న యుఎస్ ఎలక్షన్లలో గెలుస్తారా లేదా అనేది ప్రస్తుతం హార్ట్ ఎపిగ్గా మారింది సర్వేలు మాత్రం ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుపుతున్నాయి.
తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ది న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజీ కలిసి కొత్త పోల్ కండక్ట్ చేశాయి.ఈ ఫలితాల్లో ఐదు కీలక రాష్ట్రాల్లో అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) కంటే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు తేలింది.
పోల్ ఫోన్ ద్వారా అక్టోబర్ 22 నుంచి 2023, నవంబర్ 3 వరకు కండక్ట్ చేశారు.
పోల్ ఫలితాలు తెలుసుకుంటే.
నెవాడాలో( Nevada ) ట్రంప్ 52%, బైడెన్ 41% ఓట్లు సంపాదించారు.జార్జియాలో( Georgia ) ట్రంప్ 49%, బైడెన్ 43%, అరిజోనాలో( Arizona ) ట్రంప్ 49%, బైడెన్ 44%, మిచిగాన్ లో( Michigan ) ట్రంప్ 48%, బైడెన్ 43%, పెన్సిల్వేనియాలో( Pennsylvania ) ట్రంప్ 48%, బైడెన్ 44%, విస్కాన్సిన్: బైడెన్ 47%, ట్రంప్ 45% ఓట్లు సంపాదించారు.పోల్‌లో దాదాపు 4.5 పాయింట్ల లోపం ఉంది.వచ్చే ఏడాది ప్రైమరీ ఎన్నికలు ప్రారంభం కానున్నందున,

ఈ పోల్ అసలు ఓటింగ్ ఫలితాన్ని ప్రతిబింబించలేదు.బైడెన్ ప్రచార అధికార ప్రతినిధి కెవిన్ మునోజ్( Kevin Munoz ) మాట్లాడుతూ పోల్ అంచనాలు నమ్మదగినవి కాదని, బైడెన్ ప్రచారం ఓటర్లను చేరుకోవడానికి, సమీకరించడానికి తీవ్రంగా కృషి చేస్తుందని అన్నారు.బైడెన్ ఎజెండా పాపులర్ అని, ట్రంప్ తీవ్రవాదం ప్రజావ్యతిరేకమని ఆయన అన్నారు.పోల్ వివిధ వర్గాల ఓటర్లలో కొన్ని ఆసక్తికరమైన పోకడలను కూడా వెల్లడిస్తుంది.

ఉదాహరణకి యువ ఓటర్లు (30 ఏళ్లలోపు) బైడెన్‌ను ఒక పాయింట్ మాత్రమే ఇష్టపడుతున్నారు.జస్ట్ సింగిల్ డిజిట్ హిస్పానిక్ ఓటర్లు మాత్రమే అతన్ని ఇష్టపడతారు.పట్టణ ఓటర్లు బైడెన్ గెలవాలని ఆశిస్తున్నారు.అయితే గ్రామీణ ఓటర్లు ట్రంప్‌కే పూర్తి మద్దతు ఇస్తున్నారు.మహిళా ఓటర్లు బైడెన్‌కు మొగ్గు చూపుతుంటే, మగ ఓటర్లు ట్రంప్‌ను రెండింతలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.







