ప్రముఖ టాలీవుడ్ నటి షానూర్ సనా బేగం( Shanur Sana Begum ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ నటి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నా కోడలు యూట్యుబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయిందని నేను కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా సక్సెస్ అయ్యానని ఆమె అన్నారు.మా ఇంటికి స్వీట్స్ తో పాటు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని( Eco friendly Ganesha ) పంపించారని ఆమె తెలిపారు.
నేను ఆ వినాయకుడిని తీసుకుని ఇంట్లో పెట్టానని పూజలు అవి చేయడం నాకు తెలియదని షానూర్ సనా బేగం చెప్పుకొచ్చారు.ఆ తర్వాత పనిమనిషి ద్వారా వినాయకుని నిమజ్జనం ఇతర విషయాల గురించి తెలుసుకున్నానని షానూర్ సనా బేగం వెల్లడించారు.
ఆ వినాయకుడికి సంబంధించి నేను ఒక యూట్యూబ్ వీడియో చేస్తే కొన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చాయని సనా అభిప్రాయం వ్యక్తం చేశారు.
99.99 శాతం పాజిటివ్ కామెంట్లు రాగా 0.001 శాతం నెగిటివ్ కామెంట్లు వస్తాయని ఆమె తెలిపారు.ఈ వినాయకుని వీడియోకు మాత్రం 1 శాతం ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు వచ్చాయని సనా అన్నారు.నేను అల్లాను నమ్ముతున్నానని అల్లా కోసం ప్రార్థనలు చేస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.
అల్లాను పూజించే నేను వినాయకుడిని పెడితే చాలా పెద్ద తప్పు చేసినట్లా అని సనా ప్రశ్నించారు.అలా ఖురాన్ లో రాసి ఉందా నాకు తెలియదని ఆమె తెలిపారు.
నా మనస్సుకు నచ్చింది నేను చేస్తానని సనా కామెంట్లు చేశారు.ప్రొఫెషన్ లో బొట్టు పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవచ్చని రియల్ లైఫ్ లో అవసరమైతే బొట్టు పెట్టుకుంటే విమర్శిస్తారా అని ఆమె అన్నారు.
మన ఆలోచనలు కల్మషం లేకుండా ఉండాలని సనా తెలిపారు.సనా చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.