టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంత( Samantha ) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈమె అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో బిజీ అయ్యారు.
సమంత గత కొంతకాలంగా మయోసైటీసిస్ వ్యాధి( Myositi ) బారిన పడ్డారు.ఈ వ్యాధి కారణంగా ఇదివరకే సినిమాలకు విరామం ప్రకటించినటువంటి ఈమె అనంతరం కమిట్ అయినటువంటి సినిమా షూటింగ్స్ అన్ని పూర్తి చేసి పూర్తిగా ఇండస్ట్రీకి ఏడాది పాటు విరామం ఇచ్చేశారు.

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె ఒకవైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు ప్రకృతిని ఆస్వాదిస్తూ మానసికంగా కూడా తాను ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు.ఈ క్రమంలోనే పలు వెకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈమె ట్రీట్మెంట్ లో భాగంగా క్రయోథెరపీ ( Cryotheraphy ) అనే కొత్త ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఈ ఫోటోని షేర్ చేసిన సమంత రికవరీ అంటూ ఈ ట్రీట్మెంట్ గురించి చెప్పకు వచ్చారు.

ఈమె షేర్ చేసిన ఫోటో కనుక చూస్తే ఈ ట్రీట్మెంట్ లో భాగంగా ఒక స్టీల్ టబ్ లో మైనస్ డిగ్రీల చలి ఉండగా వస్తున్న మంచు ఆవిరిలో నిలబడి ఉన్నారు.ఇలా గడ్డకట్టే చలిలో ఉంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు.ఇక ఈ ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో సమంత కష్టాలు చూసినటువంటి అభిమానులు ఈమె తొందరగా రికవరీ కావాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.ఇక ఈమె చివరిగా ఖుషి సినిమా( Khushi ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా తర్వాత సమంత ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు.







