ప్రస్తుతం సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఉన్న పీక్ ఫామ్ ని ఏ హీరో కూడా ఎంజాయ్ చెయ్యడం లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.‘అఖండ ‘ సినిమాతో ప్రారంభమైన బాలయ్య బాక్స్ ఆఫీస్ దండయాత్ర, ‘వీర సింహా రెడ్డి’ మరియు ‘భగవంత్ కేసరి’( Bhagwant Kesari ) చిత్రాల వరకు కొనసాగింది.రాబొయ్యే రోజుల్లో కూడా ఇదే ఫామ్ కొనసాగబోతుంది.భగవంత్ కేసరి కి ముందు వచ్చిన రెండు సినిమాలు పూర్తిగా బాలయ్య మార్కు సినిమాలు, కానీ ‘భగవంత్ కేసరి’ చిత్రం బాలయ్య( Balayya ) మార్కుకి బిన్నంగా ఉన్న సినిమా.
మాస్ యాక్షన్ సన్నివేశాల కంటే ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.అది అభిమానులకే కాదు, ఆడియన్స్ కి కూడా తెగ నచ్చేసింది.బాలయ్య నుండి ఇలాంటి సినిమా చూసి చాలా కాలమే అయ్యింది.అప్పుడెప్పుడో మన చిన్నతనం లో ఇలాంటి సినిమాలు చేసేవాడు బాలయ్య.
‘దసరా’ కానుకగా విడుదలైన ఈ సినిమా థియేటర్స్ లో మంచిగానే రన్ అయ్యింది కానీ, పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేదనే చెప్పాలి.ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్( Pre-release theatrical business ) దాదాపుగా 68 కోట్ల రూపాయిల వరకు జరిగింది.జీఎస్టీ తో కలిపి ఇప్పటి వరకు ఈ చిత్రానికి 64 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోవాలంటే మరో మూడు కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లను రాబట్టాలి.
కానీ అది సాధ్యం అయ్యే పనిలాగా అనిపించడం లేదు.లేదు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఫుల్ రన్ లో మరో 50 లక్షల రూపాయిలు షేర్ సాధించే అవకాశం ఉంది కానీ, రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టే ఛాన్స్ లేదని అంటున్నారు .
అదే కనుక జరిగితే ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చినట్టే అని చెప్పాలి.లాంగ్ రన్ చాలా డీసెంట్ గా ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ విషయం లో ఈ చిత్రం కాస్త తడబడడం వల్లే బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోలేకపోతుండడానికి కారణం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ తమిళ హీరో విజయ్ నటించిన ‘లియో’( Leo ) చిత్రం ప్రభావం ‘భగవంత్ కేసరి’ ఓపెనింగ్స్ పై చాలా బలంగా పడిందని అంటున్నారు.
ఆ చిత్రం వల్లే ఈ సినిమాకి రెండు కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని సోషల్ మీడియా లో అభిమానులు వాపోతున్నారు.