Ma Oori Polimera 2 : మా ఊరి పొలిమేర-2 కలెక్షన్లు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఆ రేంజ్ లో వచ్చాయా?

సత్యం రాజేష్ హీరోగా నటించిన సినిమా మా ఊరి పొలిమేర.కరోనా మహమ్మారి సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓటీటీ వేదికగా విడుదలైంది.

 Ma Uri Polimera 2 Movie Collections-TeluguStop.com

థ్రియేటికల్ రిలీజ్ లేదు.ఈ చిన్న సినిమా నేరుగా ఓటీడీలోకి విడుదలైన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా ముందు వరకు సినిమాలలో కమెడియన్ గా చేస్తూ వచ్చిన సత్యం రాజేష్ సినిమాలో హీరోగా నటించాడు అంటే ముందుగా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.యావరేజ్ గా ఉంటుందని భావించారు.

లో ప్రొడక్షన్ వాల్యూస్‌తో చేతబడుల చుట్టూ తిరిగే కథతో తీసిన ఈ సినిమా నెమ్మదిగా జనాల దృష్టిని ఆకర్షించింది.

Telugu Anil Viswanath, Satyam Rajesh, Tollywood-Movie

ముఖ్యంగా ఇందులో సత్యం రాజేష్( Satyam Rajesh ) పాత్రకు సంబంధించిన ట్విస్టులు బాగానే పేలాయని చెప్పవచ్చు.ఇందులో కొంచెం బూతులు హాట్ సీన్లను జోడించి ఓటీటీ ప్రేక్షకుల అభివృద్ధికి తగ్గట్టుగా ఈ సినిమాను రూపొందించారు.ఈ సినిమాకు దర్శకుడు అనిల్ విశ్వనాథ్( Anil Viswanath ) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఎటువంటి అంచనాలు లేకుండా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా నెమ్మదిగా ఆదరణను పెంచుకుంటూ హాట్ స్టార్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన సినిమాలలో ఒక సినిమాగా నిలిచింది.అయితే ఈ సినిమాకు వస్తున్న ఆదరణను చూసి దర్శక నిర్మాతలు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించారు.

నిర్మాత బన్నీ వాసు ఈ సినిమా ఫ్యాన్సీ నేటికి దక్కించుకొని సినిమాను విడుదల చేశారు.

Telugu Anil Viswanath, Satyam Rajesh, Tollywood-Movie

సినిమాకు పబ్లిసిటీ కూడా బాగానే చేశారు.మా ఊరి పొలిమేరచూసి థ్రిల్ అయిన వాళ్లందరూ థియేటర్లకు వచ్చి మా ఊరి పొలిమేర-2( Ma Oori Polimera 2)చూడ్డానికి ఆసక్తిని ప్రదర్శించారు.చిన్న సినిమా కదా వసూళ్లు పర్వాలేదు అనిపించేలా ఉంటాయని భావించారు.

కానీ అందరికీ షాక్ ఇస్తూ ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ఏకంగా మూడు కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి సంచలనం సృష్టించింది.ఈ సినిమా రేంజికి ఇవి చాలా ఎక్కువ వసూళ్లే.

నైజాం వరకే సినిమా కోటిన్నర కలెక్ట్ చేసింది.తొలి రోజు చాలా చోట్ల సినిమాకు హౌస్ ఫుల్స్ పడ్డాయి.

సింగిల్ స్క్రీన్లు జనాలతో కళకళలాడాయి.మల్టీప్లెక్సుల్లో కూడా మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి.

టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నా అది వసూళ్ల మీద ప్రభావం చూపట్లేదు.తొలి రోజు రెస్పాన్స్ చూసి రెండో రోజు ఈ చిత్రానికి థియేటర్లు కూడా పెంచారట.

బుక్ మై షో ట్రెండ్స్‌లో ఈ సినిమానే ప్రస్తుతం తెలుగులో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం.మొత్తానికి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ కలెక్షన్ లు చూసి సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube