ఫ్రాన్స్‌లో యూదు మహిళపై కత్తి దాడి.. ఆమె ఇంటి తలుపుపై ​​స్వస్తిక పెయింట్..

ఫ్రాన్స్‌లో ( France )దారుణమైన హత్యాయత్నం చోటు చేసుకుంది.లియోన్‌లోని ( Lyon )ఇంటిలో శనివారం ఓ యూదు మహిళను గుర్తు తెలియని దుండగుడు కత్తితో పొడిచాడు, ఆమె తలుపుపై ​​స్వస్తిక పెయింట్ కూడా వేశాడు.

 Knife Attack On Jewish Woman In France Swastika Painted On The Door Of Her House-TeluguStop.com

పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు, సెమిటిక్ వ్యతిరేక ద్వేషపూరిత నేరం ఇది అయి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు.సుమారు 30 ఏళ్ల వయసు ఉన్న బాధితురాలు లియోన్‌లోని మాంట్‌లుక్ జిల్లాలో నివసిస్తోంది.

శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో డోర్‌బెల్ రింగ్ వినడంతో ఆమె తలుపు తెరిచింది.అంతే దుండగుడు లోపలికి వచ్చి ఆమెపై దాడి చేసింది.

నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి ఆమె కడుపుపై ​​రెండుసార్లు కత్తితో పొడిచాడు.ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు తెలిపారు.

నాజీ భావజాలానికి ప్రతీక అయిన స్వస్తిక ఆమె తలుపు మీద కనిపించిందని లోకల్ మీడియా వెల్లడించింది.

Telugu Semitic Hate, Door, France, Gregory Doucet, Jewish Stabbed, Lyonswastika,

లియోన్ మేయర్ గ్రెగొరీ డౌసెట్( Mayor Gregory Doucet ) తాజాగా మాట్లాడుతూ బాధితురాలికి, ఆమె కుటుంబానికి తన దిగ్భ్రాంతిని, సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ తర్వాత ఐరోపాలో అత్యధిక యూదు జనాభా ఉన్నారు.ప్రపంచంలో మూడవ అతిపెద్ద యూదు జనాభా కలిగిన ఫ్రాన్స్‌లో సెమిటిక్ వ్యతిరేక సంఘటనలు ఈమధ్య బాగా నమోదు అవుతున్నాయి.

తాజా గణాంకాల ప్రకారం, ఈ సంవత్సరం ఫ్రాన్స్‌లో 819 యూదు వ్యతిరేక కేసులు నమోదయ్యాయి, వీటిలో విధ్వంసం, భౌతిక దాడులు, హత్య బెదిరింపులు ఉన్నాయి.ఫ్రాన్స్‌లోని యూదు సంస్థల ప్రతినిధి మండలి (CRIF) ఒక నివేదికను ఉటంకిస్తూ, 2022తో పోలిస్తే 2023లో ఫ్రాన్స్‌లో యూదు వ్యతిరేకత 27% పెరిగిందని పేర్కొంది.

అక్టోబర్ 7న గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే.ఆ సంఘర్షణ వల్ల ఫ్రాన్స్‌లో యూదు వ్యతిరేకత కూడా పెరిగింది.ఈ యుద్ధం 1,400 మందికి పైగా ఇజ్రాయెల్‌లు, వేలాది మంది పాలస్తీనియన్ల ప్రాణాలను బలిగొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube