మా ఊరి పొలిమేర’ సినిమా ( Maa oori polimera 2 )ఓటీటీ వేదికగా విడుదలై సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.ఆ సినిమాకి వచ్చిన అనూహ్య రెస్పాన్స్ వల్ల మేకర్స్ తాజాగా రెండో పార్ట్ తీశారు.
మా ఊరి పొలిమేర 2 సినిమాను నవంబర్ 3న థియేటర్లలోకి రిలీజ్ చేశారు.ఈ మూవీలో అందరి పర్ఫామెన్స్ బాగానే ఉంది.
ముఖ్యంగా హీరోయిన్ రోల్ చేసిన కామాక్షి భాస్కర్ల బాగా ఆకట్టుకుంది.ఈ ముద్దుగుమ్మ సినిమాకి కొత్తవి అయినా ఆమె కుటుంబ సభ్యులు ఆల్రెడీ మూవీ ఇండస్ట్రీలో తమదైన మార్క్ చూపించారు.
కామాక్షికి ప్రముఖ టాలీవుడ్ హాస్యనటి కల్పనా రాయ్, హీరోయిన్ రంభ దగ్గరి బంధువులు అవుతారట.కామాక్షి పక్కా హైదరాబాదీ చైనాలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఈ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాలు పాటు అపోలో హాస్పిటల్‌లో డాక్టర్ గా సేవలందించింది.
అంత మంచి వృత్తిలో ఉన్నా సరే ఆమెకు నటించాలనే తపన చాలా పెరిగిపోయింది.దాంతో మోడల్ గా అవతరించింది.
కొంత సమయంలోనే మిస్ తెలంగాణ 2018 టైటిల్ నెగ్గింది.అదే ఏడాది మిస్ ఇండియా పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచి మంచి పేరు తెచ్చుకుంది.
ఈ ముద్దుగుమ్మ మరీ అందగత్తేం కాదు కానీ హీరోయిన్ మెటీరియల్‌యే.అయినను సరైన సినిమా అవకాశాలు రాక ఆమె పెద్దగా ఇప్పటిదాకా గుర్తింపు దక్కించుకోలేకపోయింది.

కామాక్షి వచ్చిన అవకాశాలు కాదనకుండా చేస్తుంది కానీ అవన్నీ చెత్త పాత్రలు కావడంతో ఈ ముద్దుగుమ్మ స్టార్ ఇమేజ్ తెచ్చుకోలేకపోయింది.ఈ తార ఇప్పటికే రెండు వెబ్ సీరీస్‌ల్లో నటించింది.వాటిలో ఆమె పర్ఫామెన్స్ బాగుండడంతో డైరెక్టర్ డా.అనిల్ విశ్వనాథ్ పొలిమేర సినిమాలో ఫుల్ లెంత్ రోల్ అందించాడు.అయితే డైరెక్టర్ నమ్మకం నిలబెడుతూ కామాక్షి( Kamakshi bhaskarla ) ఆ పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది.ఇంకా మంచి పాత్ర వస్తే ఆమె అదరగొడుతుంది.సినిమా అంటే ప్యాషన్ అని చెప్పుకుంటున్న కామాక్షి డాక్టర్ నుంచి యాక్టర్ అయి త్వరలో డైరెక్టర్ పగ్గాలు చేపడతానని చెబుతోంది

>బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) స్టార్ డం తెచ్చుకుంది.ఇప్పుడు మా ఊరి పొలిమేర సినిమా సిరీస్ తో డాక్టర్ కామాక్షి భాస్కర్ల</em( Kamakshi bhaskarla ) కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు అమ్మాయిలు సినిమాల్లో గొప్పగా నటించగలరు అని వీరిద్దరూ నిరూపిస్తున్నారు.సరిగా యాక్టింగ్ రాని ఢిల్లీ, ముంబై హీరోయిన్లను పట్టుకు రావడం కంటే మంచిగా తెలుగు భాష వచ్చిన తెలుగు హీరోయిన్లను తీసుకోవడం బెటర్ అని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే గెటప్ శ్రీను పొలిమేర సినిమాలో అదిరిపోయే పర్ఫామెన్స్ కనబరిచాడు.మంచి పాత్రలు లభిస్తే గెటప్ శ్రీను కమెడియన్‌గా, కేరక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వగలడు.దిగ్గజ నటులను కూడా భర్తీ చేయగలడు.కానీ టాప్ డైరెక్టర్లు అతడిని వాడుకోవడం లేదు.







