వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ కు టీడీపీ మద్ధతు ఇవ్వడంతో బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశారన్నారు.
బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ కు మద్ధతిస్తున్న టీడీపీకి ఏపీలో మీరు మద్ధతు ఇస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే మీది కుటుంబ రాజకీయమా? లేక కుల రాజకీయమా? అనేది చెప్పాలన్నారు.లేదంటే బీజేపీని వెన్నుపోటుపొడిచే రాజకీయమా అని ప్రశ్నించారు.మరోవైపు ఎంపీ విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పురంధేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.







