తలైవర్ 171 రజనీకాంత్ కు విలన్ గా నటించనున్న వీరాభిమాని?

సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా బిజీగా అయ్యారు తాజాగా ఈయన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

 Raghava Lawrence As Villain For Rajinikanth 171 Movie , Rajinikanth, Raghava Law-TeluguStop.com

ఇక జైలర్ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో రజినీకాంత్ తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టి పెట్టారు.ఈ క్రమంలోనే రజినీకాంత్ తన తదుపరి సినిమాని తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లాల్ సలాం అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని టి.జె జ్ఞానవేల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.

Telugu Chandramukhi, Rajinikanth-Movie

వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా రజనీకాంత్ కెరియర్ లో 170 సినిమా కావటం విశేషం.ఇక ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తన 171 వ సినిమాని ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాని తలైవర్171 గా ప్రకటించారు.అయితే ఇప్పటికీ ఇంకా ఈ సినిమాకు సంబంధించిన తారాగణం గురించి ఎలాంటి విషయాలు బయటకు రాలేదు కాని తాజాగా ఒక వార్త మాత్రం వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో రజనీకాంత్ కు విలన్ పాత్రలో ఆయన వీరాభిమానిని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

Telugu Chandramukhi, Rajinikanth-Movie

ఈ సినిమాలో రజనీకాంత్ తో పోటీ పడటం కోసం లోకేష్ రజనీకాంత్ వీరాభిమాని అయినటువంటి నటుడు రాఘవ లారెన్స్( Raghava Lawrence ) ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో లారెన్స్ రజనీకాంత్ తో పోటీ పడబోతున్నారు.ఇప్పటివరకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక లారెన్స్ రజినీకాంత్ కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈయన రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చిత్రంలో హీరోగా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కానీ ఈ సినిమా చంద్రముఖి ( Chandramukhi ) స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.ఇలా తమ అభిమాన హీరోతో కలిసి లారెన్స్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube