ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్( Bigg Boss ) ఎంత రసవత్తరంగా సాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.ఇప్పటి వరకు ప్రసారమైన సీజన్స్ అన్నిట్లో రెండవ సీజన్ మరియు 4 వ సీజన్ ని ఆడియన్స్ మొత్తం ఎంతో ఆత్రుతతో,ఆసక్తితో చూసేవాళ్ళు.
ఆ రెండు సీజన్స్ తర్వాత అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటున్న సీజన్ ఇదే.ఈ సీజన్ లో ఎవరు టాప్ 5 లో నిలుస్తారు, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చెప్పడం చాలా కష్టం అయిపోతుంది.ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ అయినా ఆడియన్స్ చాలా ఫీల్ అయ్యిపోతున్నారు.ఎందుకంటే అందరూ బాగా ఆడవాళ్లే.మొదటి వారం నుండి టాస్కులలో( Tasks ) దుమ్ములేపుతూ వచ్చిన సందీప్ గత వారం ఎలిమినేట్ అవ్వడం అందరినీ పెద్ద షాక్ కి గురి చేసింది.ఇక ఈ వారం కూడా అలాంటి ఎలిమినేషన్ ఉండబోతుందని బలంగా టాక్ వినిపిస్తుంది.
సోషల్ మీడియా లో ఉన్న ఓటింగ్ ప్రకారం అందరికంటే అతి తక్కువ ఓట్లు దక్కించుకున్న కంటెస్టెంట్ శోభా శెట్టి.( Sobha Shetty )

ఆమెనే ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వబోతుందని అందరూ అనుకున్నారు.కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏమిటి అంటే శోభా శెట్టి ఈ వారం కూడా సేఫ్ అయ్యిందని అంటున్నారు.ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందే స్టార్ మా( Star Maa ) టీం తో ఓటింగ్ తో సంబంధం లేకుండా 10 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలని అగ్రిమెంట్ కుదిరించుకుందట.
ఈ రూమర్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ ట్రెండ్ అవుతూనే ఉంది.అందుకే ఆమె ఈ వారం కూడా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉందని, ఇప్పుడు ఆమె ఇంటికి కెప్టెన్ అయ్యింది కాబట్టి, పదవ వారం కూడా నామినేషన్స్ ( Nominations ) నుండి తప్పించుకుంటుందని, అలా ఆమె టాప్ 5 లోకి ఎంటర్ అయ్యేవరకు ఇలా చేస్తూనే ఉంటారని టాక్ వినిపిస్తుంది.
ఈ వారం ఎలిమినేట్ అవ్వకపోతే ఈ రూమర్స్ కి మరింత బలంగా చేకూర్చినట్టే.

శోభా శెట్టి తర్వాత తక్కువ ఓట్లు తెచ్చుకున్న కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే రతికా,( Rathika ) ప్రియాంక( Priyanka ) మరియు టేస్టీ తేజా( Tasty Teja ) ఉన్నారు.ఈ ముగ్గురుకి దాదాపుగా ఒకే రేంజ్ ఓట్లు వచ్చాయి, కానీ రతికా ఒక అడుగు దూరం లో ఉంది.శివాజీ( Sivaji ) బ్యాచ్ తో స్నేహం చెయ్యడం వల్ల, ఆయన ఫ్యాన్స్ రతికా కి ఓట్లు వేస్తున్నారని టాక్.
అయితే ప్రియాంక మరియు తేజా ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో ఉన్నారని.వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెడితే ఇద్దరూ ఎలిమినేట్ అవ్వొచ్చు అని అంటున్నారు, వీటిల్లో ఏది నిజం అవ్వబోతుందో చూడాలి.







