కొన(య్య)కుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి

నల్లగొండ జిల్లా:గత కొన్ని రోజుల క్రితం టమాటా ధర ఆకాశాన్నంటి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు దూరమైన విషయం తెలిసిందే.తాజాగా దాని స్థానంలోకి ఉల్లి వచ్చి చేరింది.

 Onion Shedding Tears Without Cutting , Onion, Onion Price, Maharashtra , Karnata-TeluguStop.com

భారీగా పెరిగిన ఉల్లి ధరలతో సామాన్యుడికి కొయ్యకుండా కాదు కొనకుండానే కన్నీళ్లు పెట్టిస్తుంది.వంటింట్లో ఉల్లికున్న ప్రాధాన్యత తెలియంది కాదు.

అలాంటి ఉల్లి ధర మరోసారి కొండెక్కింది.ప్రస్తుతం కిలో ఉల్లి ధర( onion price ) సెంచరీ (రూ.100) వైపు పరుగులు పెడుతోంది.రిటైల్‌ మార్కెట్‌లో బుధవారం సాయంత్రం నాటికి నాణ్యత కలిగిన తెల్ల ఉల్లి గడ్డ ధర కిలో.రూ.85-90 వరకు పలికింది.ఇక ఎర్ర ఉల్లి గడ్డ ధర కిలో రూ.70- 80 మద్య పలుకుతోంది.మహారాష్ట్ర,కర్ణాటకలో ఉల్లిని అధికంగా పండిస్తుండగా ఇక్కడి నుంచే దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది.ఈ ఏడాది వర్షాలతో పంట నష్టం ఏర్పడటం,కొత్త పంట దిగుబడులు మార్కెట్‌కు రాకపోగా పాత నిల్వలు తగ్గడంతో ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇక సెప్టెంబరు మొదటి వారంలో కిలో రూ.30 ఉండగా రెండు నెలల్లో అమాంతం పెరిగింది.మార్కెట్‌లో ఉల్లి ధర రోజు రోజుకు పెరిగి పోతుండటంతో కొనలేక, తినలేక దాని వాడకాన్ని తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది.కొన్ని హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్‌ స్టాల్స్‌లో నో ఆనియన్ బోర్డులు పెడుతున్నారు.

ఉల్లి ధర తగ్గేవరకు కొనకపోవటం, తినక పోవటమే మంచిదనే అభిప్రాయానికి సామాన్యులు వస్తున్నారు.నవంబరు నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుదని,ఆ తర్వాత ధరలు తగ్గే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube