అతడు ఓ రైతు.శ్రమించి పంటలు పండించి నలుగురికి అన్నం పెట్టడమే ఆయనకి తెలుసు.
నిరంతర శ్రామికుడు, అలుపెరుగని ధీశాలి.మరణించినా కూడా తన అవయవాలు దానం చేసి చిరంజీవి అయ్యాడు.
అనేకమంది జీవితాలలో వెలుగునింపి, ప్రాణదాత అయ్యాడు.ప్రమాదంలో గాయపడగా నాలుగు రోజుల పాటు ఐసీయూ చికిత్స చేశారు.
అయినా ఫలితం లేకుండా పోయింది.ఆ అన్నదాతను కాపాడలేం అని డాక్టర్లు చేతులెత్తేశారు.
బ్రెయిన్ డెడ్( Brain dead ) అని ప్రకటించారు.తరువాత అన్నదాత కుటుంబం కొండంత బాధను దిగమింగుకొని అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు.
అవును, అవయవ దానంతో ఒక్కరు.ఇద్దరు కాదు, ఏకంగా ఐదుగురి ప్రాణాలు కాపాడారు.
వివరాల్లోకి వెళితే.అక్టోబరు 28న తన ఇంటివద్దనే అనుకోకుండా ఆ రైతు పడిపోగా తలకు బలమైన గాయమైంది.దాంతో అతన్ని సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌కు( Yashoda Hospitals, Secunderabad ) తరలించారు.అక్కడ అతను నాలుగు రోజులు అత్యవసర ICU సంరక్షణలో ఉన్నాడు.
అయినా అతని ఆరోగ్యంలో ఎటువంటి మెరుగుదల లేకపోవడంతో, అక్టోబర్ 31 న వైద్యులు అతన్ని బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు.అతనిది యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం మన్నెవారి వంపు గ్రామం( Mannevari Vampu village ).పేరు మేడబోయిన పెంటయ్య( Pentaiah ), వయస్సు 61 సంవత్సరాలు.
అలా అకారణంగా ఆయన చనిపోవడంతో పెంటయ్య భార్య మేడబోయిన సుశీల, పిల్లలు జీవందాన్( Jivandan ) తీవ్రంగా కలత చెందారు.వారి బాధ వర్ణనాతీతం.ఇటువంటి తరుణంలో కూడా వారు అవయవ దానం చేయడానికి అంగీకరించారు.
దాంతో స్థానికంగానే కాకుండా సర్వత్రా వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.రెండు కిడ్నీలు, కాలేయం , రెండు కార్నియాలతో సహా మొత్తం ఐదు దాత అవయవాలు దానం చేశారు.
మరో ఐదుగురి ప్రాణాలు కాపాడిన రైతు కుటుంబ సభ్యులకు జీవందాన్ అవయవ దాన వాలంటీర్లు కృతజ్ఞతలు తెలిపారు.నలుగురికి ఆదర్శం అని కొనియాడారు.