జయలలిత… ( Jayalalitha ) తమిళనాడు లో పుట్టి, పెరిగి హీరోయిన్ గా ఎవరు అధిరోహించిన శిఖరాలను అందుకొని ఆ తరువాత ముఖ్యమంత్రిగా( Chief Minister ) కూడా తమిళనాడు రాజకీయాలను శాసించిన మహిళా శిరోమణి.తండ్రి లేకుండా ఎన్నో కష్టాలు అనుభవించి తన చిన్నతనం నుంచి ఎవరు పడనన్నీ బాధలు పడింది.
యుక్త వయసు వచ్చాక కూడా ఆమె కష్టాలకు కొదవె లేదు.తన తల్లి జూనియర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటిస్తూ ఉండేది అందుకే తన కూతురుని హీరోయిన్ చేయాలనుకుంది.
కానీ చదువుల్లో మేటి అయిన జయలలితకి అప్పట్లో చదువుకోవాలనే కుతూహలం తప్ప నటించాలనే ఆశ ఉండేది కాదు.ఆ రంగుల ప్రపంచం ఆమెకు నప్పలేదు.
అసలు ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టడం కూడా ఇష్టం లేదు.తన తల్లి గురించి ఇరుగు పొరుగు వారు మాట్లాడుకునే మాటలను వింటూ ఎంతో బాధపడుతూ ఉండే జయలలిత తను ఒక స్టార్ హీరోయిన్( Star Heroine ) అవుతారని ఏ రోజు కలలు కనలేదు.
కానీ విదిరాతను ఎవరు తప్పించగలరు చెప్పండి.తనకు సంబంధం లేకుండానే ఆ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టింది.కానీ తన దృష్టంతా చదువు మీదే ఉంది.అయినా కూడా ఎక్కడైనా ఓడిపోయే అలవాటు లేదు ఆమెకు.అందుకే సినిమా ఇండస్ట్రీని( Cinema Industry ) కూడా చాలా ఏళ్ల పాటు హీరోయిన్ గా ఏలింది.ఎంజీఆర్( MGR ) భాగస్వామిగా ఆమెకు ఎక్కడికి వెళ్లినా నీరాజనాలే దొరికాయి.
కానీ ఆమెతో వచ్చిన చిక్కల్ల ఒకటి షూటింగ్ సెట్లో ఉంటే ఎవరితో మాట్లాడదు.ఎప్పుడు ఏదో ఒక పుస్తకం చదువుకుంటూనే ఉంటుంది.
అందరూ ఆమెకు పొగరు అని ఆమె ఎవరితో స్నేహం చెయ్యదు ఎవరితోనూ మాట్లాడదు అంటూ ఆమె గురించి చెడుగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
అయితే ఈ రూమర్స్ అన్నిటికీ ఆమె ముఖ్యమంత్రి అయిన తర్వాత సమాధానాలు ఇవ్వడం మొదలుపెట్టారు.తాను ఇంట్రోవర్ట్( Introvert ) అని, ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉండదని, చాలా సిగ్గరి అంటూ తాను అందుకే మాట్లాడే దాన్ని కాదని, అందరూ తప్పుగా అర్థం చేసుకొని తనపై లేనిపోని వార్తలను సృష్టించి ప్రచారం చేసే వారని కానీ తను అలాంటి వ్యక్తిని కాదు అంటూ చెప్పింది.అంతేకాదు తను జనాలను ఈజీగా నమ్ముతానని అందువల్లే తనను చాలా మంది తమ అవసరాల కోసం వాడుకుంటూ ఉంటారని కూడా తెలిపింది.
కానీ కొన్నేళ్ల తర్వాత అన్నింటిని అధిగమించానని, మాట్లాడటం తనకు అలవాటైందని తనలోని ఆ సిగ్గు బిడియం పోయాయని, తను ఇప్పుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను చెప్పింది జయలలిత.