హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలోనే కుర్చీలను ఎత్తివేస్తూ నానా హంగామా సృష్టించారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభ్యర్థిగా మల్ రెడ్డి రంగారెడ్డిని మార్చి తనకు టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ నేత దండెం రాంరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో గాంధీభవన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు మరియు రాంరెడ్డి అనుచరులు నిరసనకు దిగారు.
దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.అయితే ఇబ్రహీంపట్నం టికెట్ ను సీనియర్ నేత మల్ రెడ్డి రంగారెడ్డికి ఇస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.







