Tollywood Remake Movies: బాలీవుడ్ లో వరసగా ఫ్లాప్ అవుతున్న తెలుగు రీమేక్ చిత్రాలు.. లిస్ట్ చాలా పెద్దది

ఈ మధ్యకాలంలో ఖచ్చితమైన ఘనవిజయం సాధించిన సినిమాగా బేబీ చిత్రాన్ని( Baby Movie ) చెప్పుకోవచ్చు.23వ సంవత్సరానికి గాను ఇది ఒక సర్ప్రైసింగ్ హిట్.దాదాపు మూడు కోట్ల బడ్జెట్ తో వచ్చి 90 కోట్ల రూపాయలను వసూలు చేసింది.అయితే మేకర్స్ తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో( Bollywood ) రీమేక్ చేయాలని అనుకుంటున్నారట.

 Tollywood Remakes Flop In Bollywood Rx 100 Jersey Mca Ala Vaikuntapuramuloo-TeluguStop.com

ఎందుకంటే ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్టు కాబట్టి అక్కడ కూడా ఘనవిజయం సాధించే అవకాశాలు ఉన్నాయనేది బేబీ నిర్మాతల అభిప్రాయం.మరి ఈ సినిమా విజయం సాధించాలంటే టాలీవుడ్ కి ఈ మధ్యకాలంలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది.

అది దాటితే తప్ప బేబీ సినిమా విజయం సాధించడం కష్టమే.

Telugu Baby Hindi, Bollywood, Jersey, Mca, Rx, Tollywood, Tollywood Flop-Movie

కాలంలో బాలీవుడ్ లో అవుతున్న తెలుగు రీమేక్ సినిమాలన్నీ( Telugu Remake Movies ) కూడా ఆ జయాన్ని సాధించడం చెప్పుకోవాల్సిన విషయం.టాలీవుడ్ లో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమా( Ala Vaikhuntapuramuloo ) ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మరి ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తే పట్టించుకున్న నాధుడే లేడు.ఇక బేబీ నేపథ్యంలోనే తెరకెక్కిన ఆర్ఎక్స్ 100( RX 100 ) సినిమా సైతం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తే మాత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా( Jersey Movie ) క్రికెట్ నేపథ్యంలో తెరకేక్కి అతనికి మంచి విజయాన్ని ఇవ్వడంతో పాటు ఇండస్ట్రీలో కూడా మంచి చిత్రం గా నిలిచింది కానీ ఇదే సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తే అది కూడా పరాజయాన్ని మిగిల్చింది.

Telugu Baby Hindi, Bollywood, Jersey, Mca, Rx, Tollywood, Tollywood Flop-Movie

ఇక నాని నటించిన మరొక చిత్రం ఎంసీఏ( MCA Movie ) ఈ సినిమా సైతం బాలీవుడ్ లో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.గద్దల కొండ గణేష్( Gaddalakonda Ganesh ) సైతం మంచి విజయాన్ని సాధించిన తెలుగుకు మాత్రమే ఆ విజయం పరిమితం అయింది బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించలేదు.ఇండియా సినిమాలను ఆదరిస్తున్న నార్త్ ఆడియన్స్ తెలుగు చిత్రాలను రీమేక్ చేస్తే మాత్రం ఒప్పుకోవడం లేదు మరి ఇన్ని బ్యాడ్ సెంటిమెంట్స్ దాటి సాయి రాజేశ్ దర్శకత్వంలో బేబీ సినిమా ఏ మాత్రం బాలీవుడ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube