Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా సినిమాల విషయంలో ఇంత తెగింపు ఎంటి..?

సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) ఈ దర్శకుడు పేరు చెబితే మన మైండ్ లో టక్కున కదిలే సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో టాలీవుడ్ డి షేక్ చేసేసాడు సందీప్.

 Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా సి-TeluguStop.com

పరిస్థితి ఎంతలా మారిపోయింది అంటే అర్జున్ రెడ్డికి ముందు అర్జున్ రెడ్డి కి తర్వాత అన్నట్టుగా ఆ సినిమా ఇండస్ట్రీ మారిపోయింది అంతలా సినిమా విషయంలో అభిప్రాయాలను మార్చుకునేలా చేసింది.ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కాదా ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తీసి అదే స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవడం సందీప్ రెడ్డి వంగాకే చెల్లింది.

అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే సందీప్ రెడ్డి తీస్తున్న సినిమాల రన్ టైం గురించే.

Telugu Animal, Animal Runtime, Arjun Reddy, Bollywood, Lengthy, Sandeepreddy, Sa

అర్జున్ రెడ్డి సినిమాను( Arjun Reddy ) దాదాపు నాలుగు గంటల నిడివితో తీసాడట.కానీ అంత లెంత్ సినిమా చూడటం కుదరదు కాబట్టి అతి కష్టం మీద దాన్ని మూడు గంటలకు పైగా ఉంచి సినిమా థియేటర్లో విడుదల చేయగా ఘనవిజయాన్ని సాధించింది.ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాతో పాటు జనాలు ట్రావెల్ అయ్యే విధంగా సందీప్ ఆ చిత్రంలో తన మ్యాజిక్ ని వర్కౌట్ చేసుకున్నాడు.

కానీ అందరికీ అలా వర్కౌట్ అవ్వడం సాధ్యమయ్యే పని కాదు.ఇప్పుడున్న ప్రేక్షకులకు ఓపిక తక్కువ.అన్నేసి గంటలు సినిమా థియేటర్లో కూర్చోవాలంటే జరిగే పని కాదు.అసలు థియేటర్లకే జనాలు వచ్చే రోజులు కావు.

కానీ నాలుగు గంటల పాటు సినిమా చూడడం అనేది ఎలా పాజిబుల్ అవుతుందనేది పెద్ద ప్రశ్న.

Telugu Animal, Animal Runtime, Arjun Reddy, Bollywood, Lengthy, Sandeepreddy, Sa

అర్జున్ రెడ్డి సినిమా నీ ఓటిటి లో నాలుగు గంటల పాటు ఉండేలా చూసుకుని విడుదల చేశాడు.ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే ప్రస్తుతం బాలీవుడ్ లో సందీప్ తెరకెక్కిస్తున్న ఆనిమల్ సినిమా( Animal Movie ) పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది.ఈ సినిమా కూడా రన్ టైం దాదాపు నాలుగు గంటలు వచ్చిందట.

ఎంత ట్రై చేసినా కూడా దానిని మూడు గంటల 20 నిమిషాలకు తగ్గకుండా ట్రిమ్ చేశాడట తనకు తన సినిమాపై కంటెంట్ పై ఉన్న నమ్మకం అలాంటిది మరి అందుకే తన సినిమాతో ప్రేక్షకులు ట్రావెల్ అవుతారు అని గట్టిగా నమ్ముతున్నాడు.మరి ఇన్ని గంటల సినిమాను విడుదల చేశాక చూడాలి ఆ చిత్రం రిజల్ట్ ఏంటా అని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube