ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు.
సత్తుపల్లిలో 70 వేల మెజార్టీతో సండ్ర గెలుస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.ఎవరో చెప్పారని ఓటు వేయడం కరెక్ట్ కాదన్నారు.
సొంత విచక్షణతో ఓటు వేయాలన్న కేసీఆర్ దళితులు అణిచివేత, వివక్షకు గురయ్యారని తెలిపారు.దళితులను ఓటు బ్యాంకులా వాడుకున్నారని పేర్కొన్నారు.
దళితుల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ తప్ప ఎవరూ ఆలోచించలేదన్నారు.ఆరునూరైనా తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని తెలిపారు.ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు, పార్టీల మధ్య పోరాటమని స్పష్టం చేశారు.







