పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం సలార్ ( Salaar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది.
ఈ క్రమంలోని ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటమే కాకుండా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది.
ప్రభాస్ సర్జరీ కారణంగా విదేశాలలోని ఉన్న సంగతి తెలిసిందే.త్వరలోనే ఈయన ఇండియా రానున్నారని ఇండియా వచ్చిన వెంటనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెడుతున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి.ఈ సినిమా వివిధ భాషలలో ప్రసారం కాబోతున్నటువంటి నేపథ్యంలో పలు భాషలలో డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమవుతున్నాయని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ సినిమాకు చాలామంది కే జి ఎఫ్ సినిమాకు పనిచేసినటువంటి వారే ఈ సినిమాలో కూడా భాగమయ్యారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కన్నడ వెర్షన్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

ప్రభాస్ సలార్ సినిమాలోని కన్నడ వర్షన్ కి సంబంధించి ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పడానికి కేజిఎఫ్ ( KGF )విలన్ రంగంలోకి దిగారని తెలుస్తోంది.కే జి ఎఫ్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన వశిష్ట సింహ (Vasista Simha) ప్రభాస్ కు కన్నడలో డబ్బింగ్ చెప్పబోతున్నారని తెలుస్తోంది.ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా వశిష్ట వాయిస్ బేస్ ఉందని ఈయన అయితే కరెక్ట్ గా సరిపోతారని ప్రశాంత్ భావించినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ప్రభాస్ పాత్రకు వశిష్ట డబ్బింగ్ చెప్పబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







