నాచురల్ స్టార్ నాని హీరోగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందుతున్న హాయ్ నాన్న ( Hi Nanna )సినిమా విడుదలకు సిద్ధం అయింది.డిసెంబర్ 7వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
అంటే విడుదలకు ఇంకా దాదాపుగా అయిదు వారాల సమయం ఉంది.సాధారణంగా అయితే సినిమా విడుదలకు రెండు లేదా మూడు వారాల నుంచి ప్రమోషన్ మొదలు పెడతారు.
కానీ నాని సినిమాకు ఏకంగా అయిదు వారాల ముందు నుంచే ప్రమోషన్ చేస్తున్నారు.నాని మరియు మృణాల్ సరదాగా గేమ్స్ ఆడుతున్న వీడియో లను షేర్ చేయడం ద్వారా సినిమా ప్రమోషన్ ను యూనిట్ సభ్యులు మొదలు పెట్టారు.
నాని ఈ సినిమా పై చాలా నమ్మకం పెట్టుకున్నాడు.అందుకే నెల ముందు నుంచే ప్రమోషన్ కు డేట్లు ఇచ్చాడని తెలుస్తోంది.నాని కొత్త సినిమా ను ఇటీవలే మొదలు పెట్టాడు.అయితే ఆ సినిమా షూటింగ్ ను కూడా పక్కన పెట్టి హాయ్ నాన్న విషయం లోనే ఎక్కువ శ్రద్ద పెడుతున్నాడని తెలుస్తోంది.
మొత్తానికి నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమా పై అంచనాలు భారీగా పెంచుతున్నారు.అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొన్ని వారాలు ఆగాల్సిందే.
సీతారామం సినిమా( Sita Ramam ) తర్వాత మృణాల్ నుంచి వస్తున్న సినిమా ఇదే అవ్వడం వల్ల కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఇక నాని గత చిత్రాల ఫలితాల నేపథ్యం లో ఈ సినిమా కచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.హాయ్ నాన్న సినిమా లో కథ ను చాలా విభిన్నంగా దర్శకుడు చూపించబోతున్నాడు.నాని ని పదేళ్ల అమ్మాయికి తండ్రిగా చూపించడం అనేది కచ్చితంగా సాహస నిర్ణయం.
మరి దాన్ని ఎలా ఆడియన్స్ ఒప్పుకునే విధంగా దర్శకుడు చూపిస్తాడు అనేది చూడాలి.