ఢిల్లీలో ఇవాళ సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాపై కమిటీ కసరత్తు చేయనుంది.
పొత్తుల నేపథ్యంలో జనసేనకు ఇచ్చే స్థానాలు మినహా మిగతా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు నేతలు.ఈ క్రమంలోనే కోర్ కమిటీ నివేదికను బీజేపీ అగ్రనేత జేపీ నడ్డాకు కిషన్ రెడ్డి అందించనున్నారు.
కాగా రెండు రోజుల తరువాత జనసేనకు ఇచ్చే స్థానాలపై స్పష్టత రానుంది.కూకట్ పల్లి, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, ఖమ్మం, నల్గొండతో పాటు ఏపీ సరిహద్దు జిల్లాల నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
రేపు బీజేపీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.







