మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) నటి లావణ్య త్రిపాఠిల( Lavanya Tripati ) వివాహం నవంబర్ 1వ తేదీ ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే.వీరి వివాహం ఇటలీలోని టుస్కాని నగరంలో జరగబోతోంది.
ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పెళ్లి వేడుకలలో సందడి చేస్తున్నారు.కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతున్నటువంటి ఈ పెళ్లి వేడుకకు మరొక సినీ హీరో నితిన్ ( Nithin ) మాత్రమే హాజరు కాబోతున్నారని తెలుస్తుంది.
నితిన్ వరుణ్ తేజ్ కు మంచి స్నేహితుడు అలాగే లావణ్య త్రిపాఠి ఇచ్చిన బ్యాచిలర్ పార్టీలో కూడా నితిన్ భార్య శాలిని పాల్గొని సందడి చేశారు.ఈ క్రమంలోనే వరుణ్ పెళ్లికి నితిన్ కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది.

ఈ సందర్భంగా నితిన్ ఏకంగా తన ఫ్యామిలీతో కలిసి బస్సులో టుస్కాని నగరానికి చేరుకోబోతున్నారని తెలుస్తోంది.నిజానికి నితిన్ నటిస్తున్నటువంటి ఎక్స్ ట్రా.ఆడినరీ మ్యాన్ సినిమా పనుల నిమిత్తం ఈయన ఇటలీ వెళ్లారు.అక్కడే ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక వరుణ్ తేజ్ పెళ్లి కూడా ఇటలీలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈయన ప్రత్యేకంగా ఒక బస్సు మాట్లాడుకుని తన ఫ్యామిలీతో కలిసి ఈ పెళ్లి వేడుకకు హాజరు కాబోతున్నారని తెలుస్తుంది.

నితిన్ తో పాటు తన భార్య శాలిని అలాగే తన అక్క బావ అలాగే డిజైనర్ నీరజకోనా ( Neeraja kona ) కూడా ఈ పెళ్లి వేడుకకు వెళ్తున్నారు.ఈ పెళ్లికి వెళ్లడానికి నితిన్ ప్రత్యేకంగా బస్సు మాట్లాడుకోవడమే కాకుండా బస్సు ముందు నిలబడి ఫోటోలు దిగడంతో ఆ ఫోటోలను నితిన్ బావ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇక నితిన్ కూడా ఈ ఫోటోలను షేర్ చేస్తూ వరుణ్ పెళ్లి పార్టీకి హాజరు కాబోతున్నట్లు తెలిపారు.
ఇలా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోయే ఈ పెళ్లి వేడుకలలో నితిన్ ఫ్యామిలీ ( Nithin Family )కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.







