ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ప్రతి ఒక్క పార్టీ ఏదో ఒక కొత్త వ్యూహం పన్నుతూ ప్రజల్లోకి వెళ్లడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ (Congress) ఆరు గ్యారెంటీలు అలాగే బీఆర్ఎస్ అభివృద్ధి పథకాలు అంటూ చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్లి మమేకమవుతున్నారు.
అయితే బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం( BC CM ) చేస్తామంటూ అమిత్ షా( Amit Shah ) ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.అయితే బిజెపి తెలంగాణలో అధికారంలోకి రావడం సులభం కాదు.
అందుకే వాళ్ళు బిసి సీఎం అనే ఒక కొత్త నినాదాన్ని తెరమీదకి తీసుకువచ్చారు అనే సంగతి చాలా మందికి తెలుసు.
అయినప్పటికీ ఈ విషయంలో నోరు జారీ అడ్డంగా బుక్కయ్యారు కల్వకుంట్ల అన్న చెల్లెళ్లు.
కేటీఆర్ (KTR) బిజెపి అధికారంలోకి వస్తే బీసీ సీఎం అనే విషయంలో స్పందిస్తూ.సీఎంగా చేయాలంటే కులం కాదు ముఖ్యం గుణం అని కౌంటర్ ఇచ్చారు.అయితే ఈ కౌంటర్ పై చాలామంది బీసీ నేతలు భగ్గుమంటున్నారు.అంటే మీరు మాట్లాడే మాటలు వెనుక అర్థం బీసీ(BC) లకు గుణం లేదనా.
గుణం లేనిది ఎవరికో అర్థమయిపోతుంది అని ఈ విషయాన్ని చాలా వైరల్ చేస్తున్నారు బిజెపి కార్యకర్తలు.
అలాగే కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కూడా ఈ విషయంపై స్పందిస్తూ బీసీ సీఎం అని బిజెపి చెప్పుకురావడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అని చెప్పింది.అయితే ఈమె మాటలు కూడా బీజేపీ నేతలు ట్రోల్స్ చేస్తున్నారు.ఎన్నికల స్టంట్ అంటే ఎలా ఉంటుందో మీ కుటుంబానికే బాగా తెలుసు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళిత నాయకుడిని సీఎం చేస్తానని చెప్పారు.
ఇప్పుడు కనిపించడం లేదా అని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ఇలా కల్వకుంట్ల అన్న చెల్లెళ్లు ఇద్దరు బీసీ సీఎం విషయంలో నోరు జారి అడ్డంగా బుక్ అయ్యారు.ఇక బీసీ లను సీఎం చేసే విషయంలో కేటీఆర్ కి చిన్న చూపు ఉంది.
బీసీలు అంటే అంత తక్కువ జాతి వాళ్ళలా కనిపిస్తున్నారా అంటూ కొంతమంది కావాలనే బిజెపి (BJP) కార్యకర్తలు ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.మరి వీళ్ళు మాట్లాడిన మాటలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.