మరో రెండు రోజుల్లో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు ఉన్నాయి.ఇప్పటికే పెళ్లి వేడుకకు అంత సిద్ధమయ్యింది.
ఇటలీలో నవంబర్ ఒకటవ తేదీన వరుణ్ తేజ్ లావణ్య వివాహం జరగనుండగా ఇప్పటికే మెగా ఫ్యామిలీ అందరూ అక్కడికి చేరుకున్నారు.మరోవైపు లావణ్య( Lavanya Tripathi ) కుటుంబ సభ్యులు స్నేహితులు ఫ్రెండ్స్ సెలబ్రిటీలు కూడా అక్కడికి చేరుకున్నారు.
ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు కలిసి పెళ్లి పనులను షురూ చేసేసారు.ఈ పెళ్లి వేడుక కోసం ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ కూడా ఇటలీ చేరుకున్నారు.
కాగా ఇటలీలోని( Italy ) టుస్కానీ నగరంలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్న విషయం తెలిసిందే.ఈనెల 31న హల్దీ, మెహందీ వేడుకలతో పెళ్లిసందడి మొదలు కానుంది.అయితే సెలబ్రిటీల పెళ్లి అంటే దుస్తుల ఎంపికలోనూ ప్రత్యేకంగా కనిపిస్తారు.స్పెషల్‌గా డిజైన్ చేసిన డ్రెస్సులనే వెడ్డింగ్‌లో ధరిస్తారు.కానీ కాబోయే మెగా కోడలు కూడా ఒక సంప్రదాయాన్ని ఫాలో అవుతోంది.హల్దీ వేడుక( Haldi ) కోసం కాబోయే వధువు లావణ్య త్రిపాఠి తన తల్లి చీర కట్టుకోనుంది.
తన తల్లి చీరను కేప్ లెహంగాలో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.అయితే గతంలో నిహారిక కొణిదెల( Niharika ) సైతం తన పెళ్లి వేడుకలో తల్లి చీరను ధరించింది.
ప్రస్తుతం వరుణ్ తేజ్( Varun Tej ) పెళ్లాడబోతున్న లావణ్య త్రిపాఠి అదే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది.తన తల్లి దుస్తులనే ధరించాలని నిర్ణయించుకుంది.ఈ విషయంలో నిహారికను ఫాలో అవుతోంది లావణ్య త్రిపాఠి.మరోవైపు వరుణ్ తేజ్ హల్దీ వేడుకలో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పసుపు కుర్తా ధరించి కనిపించనున్నారు.
కాగా గతంలో కరీనా కపూర్ ఖాన్, యామీ గౌతమ్, మిహీకా బజాజ్ కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగించిన విషయం తెలిసిందే.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు సంతోషంగా కామెంట్లు చేస్తుండగా మరికొందరు ఇలాంటి విషయాలు నిహారికను ఫాలో అవుతే మంచిదే కానీ లైఫ్ విషయంలో మాత్రం నిహారికను ఫాలో అవ్వకు అంటూ లావణ్య త్రిపాటికి సలహాలు ఇస్తున్నారు.
అక్కగా మెగా డేటా నిహారిక ఇటీవలే తన భర్త చైతన్యతో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.అప్పటినుంచి మెగా అభిమానులు కూడా సమయం చికినప్పుడల్లా నిహారిక పై ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు.