సైబర్ నేరగాళ్ల వలలో సాధారణ ప్రజలు మాత్రమే కాదు పెద్ద పెద్ద బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా పడుతున్నాయి.ఒక వ్యక్తిని లేదా ఒక సంస్థని మోసం చేయడానికి కొత్త తరహా దారులను వెతుక్కొని దొరికిన వరకు దోచేస్తున్నారు.ఈ క్రమంలో అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంక్ లో( American Express Bank ) ఏకంగా రూ.4.33 కోట్లను కాజేశాడు ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.కిండ్రిల్ సొల్యూషన్స్ సంస్థలో పనిచేసే ఉద్యోగి యార్లగడ్డ ప్రదీప్( Yarlagadda Pradeep ) అనే వ్యక్తి ఓ కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు.సోమాజిగూడలో( Somajiguda ) ఉండే అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంక్ కు చెందిన బ్యాంక్ సెక్యూరిటీ అలర్ట్ సిస్టం ను తప్పు దోవ పట్టించాడు.ఆ తర్వాత పలు దఫాలుగా 4.33 కోట్ల వరకు లావాదేవీలు జరిపాడు.కానీ ఒక్క రూపాయి కూడా తిరిగి రీ పేమెంట్ చేయలేదు.
బ్యాంక్ సిబ్బందికి రీ పేమెంట్ జరగకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీశారు.అయితే అప్పటికే యార్లగడ్డ ప్రదీప్ కిండ్రిల్ సొల్యూషన్స్ లో ఉద్యోగం మానేసినట్లు నిర్ధారణ అయింది.
ఇక చేసేదేమీ లేక బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులు స్పందిస్తూ.సైబర్ నేరగాళ్ల దాడులకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, సాధారణ ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ లలో అనవసరం అయిన లింక్లు, ఇంకా అనవసరమైన వాటిని క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దని హెచ్చరిస్తున్నారు.