డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) టీడీపీ యువ నేత నారా లోకేష్( Nara Lokesh ) పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.ఇటీవల మీడియా సమావేశంలో రాంగోపాల్ వర్మ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా లోకేష్ సీరియస్ గా రియాక్ట్ కావడం జరిగింది.
అసలు ఆర్జీవి ఏపీకి ఏం చేశాడు.? అతని గురించి నేను ఏం మాట్లాడాలి అంటూ లోకేష్ అసహనం వ్యక్తం చేశారు.దీంతో తనపై చేసిన వ్యాఖ్యలకు ఆర్జీవి రియాక్ట్ అయ్యారు.“లోకేష్ నిన్ను చూసి జాలి పడాలో.నవ్వాలో అర్థం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను ఎందుకు చేస్తాను అని ప్రశ్నించారు.నేను ఫిలిం మేకర్ సినిమాలు తీయడం నా పని.నేను జనాలకు సేవ చేస్తాను అని ఏనాడు అనలేదు.
అదే నేను నీ స్థానంలో ఉంటే అదే ప్రశ్న ఎదురైతే. ఆర్జీవి( RGV ) పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తాడు.అర్థం పర్థం లేని ట్వీట్ లు పెడతాడు.బాధ్యత లేని మనిషి అని చెబుతాను.
ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎలా బేబీ అంటూ లోకేష్ పై వీడియోలో ఆర్జీవి సెటైర్లు వేశారు.నా జీవితం తెరిచిన పుస్తకం.
నా వెనకాల ఉన్న ఫోటోలు అన్నీ కనబడుతున్నాయి కదా.నీలాగా స్విమ్మింగ్ పూల్ లో అమ్మాయిలతో దిగిన ఫోటోలు దాచేసి నేను అలాగే ఏమి చెప్పను.చంద్రబాబు అరెస్ట్ తో.నీ మైండ్ ఏమైనా దెబ్బతిన్నదేమో అంటూ.లోకేష్ పై ఆర్జీవి సెటైర్లు వేస్తూ ట్విటర్ లో వీడియో విడుదల చేశారు.