రాజీనామాలకు కారణం అవుతున్న కాంగ్రెస్ రెండో జాబితా

అంతా బాగుందనుకున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో( Telangana Congress ) రెండో విడత అభ్యర్థుల జాబితా ప్రకటన చిచ్చు రేపింది.టిక్కెట్ ఆశించి భంగపడిన నేతలు బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కడమే కాకుండా,  పార్టీ మారేందుకు సిద్ధమవడం , మరి కొంతమంది నాయకులు పోటీ చేస్తామని ప్రకటనలు చేస్తుండడం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది.

 Political Leaders Unhappy With Congress Party Second List Details, Telangana, Bj-TeluguStop.com

ఇంకొంతమంది రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఈ వ్యవహారాలన్నీ కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి.

  ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి.కాంగ్రెస్ కూడా ఈ ప్రచారంలో  నిమగ్నం అయినా , టికెట్ల( Congress Tickets ) విషయంలో కాక రేగడంతో  టికెట్ ఆశించి భంగపడిన నేతలు బహిరంగంగానే పార్టీ విమర్శలు చేస్తున్న క్రమంలో,  వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు .దీనికి తోడు పార్టీలలో కొత్తగా చేరికలు,  వామపక్ష పార్టీలతో పొత్తులు వ్యవహారం పార్టీ అభ్యర్థి ఎంపిక ఇలా అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి.మొదటి విడతలో 55 మంది పేర్లతో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.

Telugu Congressasembly, Erra Sekhar, Gali Anil, Revanth Reddy, Subhash Reddy, Te

ఆ తర్వాత 45 మందితో రెండో జాబితాను ప్రకటించింది.మిగిలిన స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎంపిక పూర్తి చేసే పనిలో నిమగ్నం అవ్వగా,  రెండో జాబితా ప్రకటన తర్వాత కాంగ్రెస్ లో ధిక్కార స్వరాలు పెరిగిపోయాయి.ఏకంగా 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.జడ్చర్ల లేదా నారాయణపేటలో ఏదో ఒక స్థానం నుంచి తనకు అవకాశం ఇస్తారని భావించిన ఎర్ర శేఖర్ కు( Erra Shekar ) రెండు చోట్ల నిరాశ ఎదురయ్యింది.

ఇంకా ఎల్లారెడ్డి టికెట్ దక్కకపోవడంతో కన్నీటి పర్యంతమైన సుభాష్ రెడ్డి( Subhash Reddy ) పార్టీకి రాజీనామా చేశారు .రెబెల్ గా పోటీ చేయడమే కాకుండా రేవంత్ రెడ్డిని( Revanth Reddy ) ఓడిస్తానని శపధం చేశారు .అలాగే నరసాపూర్ టికెట్ ఆశించిన గాలి అనిల్ కు( Gali Anil ) నిరాశ ఎదురు కావడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బల్మూరి వెంకట్ ఈసారి తనకు టిక్కెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు.

కానీ ఇక్కడ ఓడితెల ప్రవీణ్ ను అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.దీంతో బల్మూరు వెంకట్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Telugu Congressasembly, Erra Sekhar, Gali Anil, Revanth Reddy, Subhash Reddy, Te

హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ కి టికెట్ రావడంతో ప్రవీణ్ రెడ్డి అలక చెందారు.అలాగే పాలకుర్తి టికెట్ ఆశించి భంగపడిన తిరుపతిరెడ్డి( Tirupati Reddy ) అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మహబూబాబాద్ లో బలరాం నాయక్ , ఎల్లయ్య నాయక్ టికెట్ కోసం పోటీ పడ్డారు .కానీ వీళ్ళిద్దరికీ కాకుండా మురళి నాయక్ కు టికెట్ ఇచ్చింది.జూబ్లీహిల్స్ టికెట్ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికి( Vishnuvardhan Reddy ) ఇవ్వకుండా అజారుద్దీన్ పేరును తెరపైకి తేవడంతో విష్ణు వర్ధన్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు .అలాగే అంబర్ పేట టికెట్ కోసం మోతే శ్రీకాంత్ , మోతే రోహిత్ పోటీపడ్డారు.కానీ ఈ సీటును రోహిన్ రెడ్డి కి కేటాయించారు.దీంతో ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో ఉండాల లేదా అనే విషయంలో ఆలోచనలో పడ్డారు.మహేశ్వరం టికెట్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి దక్కడంతో ఇక్కడ టికెట్ ఆశించిన పారిజాత నరసింహారెడ్డి( Parijatha Narasimha Reddy ) అసంతృప్తితో ఉన్నారు.దేవరకొండ టికెట్ నేనానత్ బాలునాయక్ కు దక్కడంతో రమేష్ నాయక్ ఆగ్రహంతో ఉన్నారు.

  మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పాల్వాయి స్రవంతి ,( Palvai Sravanthi ) ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న కృష్ణారెడ్డిని కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఈ ఇద్దరు నేతలు ఫైర్ అవుతున్నారు.ఈ విధంగా రెండో విడత జాబితా తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి అదుపు తప్పినట్టుగానే కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube