తెలంగాణ కాంగ్రెస్ లో లుకలుకలు భయట పడుతున్నాయి.చాలా నియోజకవర్గాల్లో టికెట్ల విషయంలోనూ, ప్రాధాన్య విషయంలోనూ ఆ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవుతూ బహిరంగంగానే సంచలన విమర్శలు చేస్తూ ఉండడం ఇబ్బందికరంగా మారింది.
ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో( Kamareddy ) కాంగ్రెస్ లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.కెసిఆర్ పై పోటీకి స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సిద్ధం కావడంతో, అక్కడ టికెట్ ఆశించిన నేతలు ఒకసారిగా ఫైర్ అవుతున్నారు.
రేవంత్ రెడ్డి తమను మోసం చేశారని, తమ తడాఖా ఏమిటో చూపిస్తామంటూ బహిరంగంగానే సవాళ్లు విసురుతుండడం తెలంగాణ కాంగ్రెస్ లో ఆందోళన పెంచుతోంది.కేసీఆర్ ను కామారెడ్డిలో ఓడించాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది .కానీ అక్కడ పరిస్థితులు మాత్రం అనుకూలంగా కనిపించడం లేదు.

టిక్కెట్ ఆశించి భంగపడిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి( Vaddepalli Subhash Reddy ) పార్టీకి రాజీనామా చేశారు .దీంతో ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు.ఇక ఎల్లారెడ్డిలో కె.మధన్ మోహన్ కు టికెట్ కేటాయించడాన్ని సుభాష్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.అలాగే జుక్కల్ లో మాజీ ఎమ్మెల్యే గంగారం( EX MLA Gangaram ) తన అనుచరులతో సమావేశం కాబోతున్నారు.
జుక్కల్ టికెట్ పెండింగ్ లో పెట్టడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తన అనుచరులతో చర్చిస్తున్నారు.త్వరలోనే తన రాజకీయ కార్యాచరణను ఆయన ప్రకటించే అవకాశం ఉంది.
టికెట్ కోసం రెండు వర్గాలు తీవ్రంగా పోటీ పడుతుండడంతో ఆ టికెట్ ను పెండింగ్లో పెట్టారు.కామారెడ్డి తో పాటు మిగిలిన నియోజకవర్గల్లో కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు, అసంతృప్తులు బయటపడుతుండడాన్ని బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకుంటుంది.

కాంగ్రెస్ లోని( Congress ) అసమ్మతినేతలను తమ పార్టీలు చేర్చుకునే వ్యూహానికి సిద్ధమయింది.అలాగే కామారెడ్డిలో కెసిఆర్ విజయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) రంగంలోకి దిగారు.కాంగ్రెస్ వైఫల్యాలను తమకు అనుకూలంగా మార్చడంతో పాటు, బీఆర్ఎస్ పై కామారెడ్డిలో ఎక్కడెక్కడ ఏ ఏ విషయాల్లో వ్యతిరేకత ఉందనే విషయాలపైన కేటీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.ఈ మేరకు తమను కలిసిన కామారెడ్డి రైతు జేఏసీ బృందంతో కామారెడ్డి మాస్టర్ ప్లాన్( Kamareddy Master Plan ) ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ఇప్పటికే రైతులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మునిసిపల్ శాఖ తెలిపిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.అలాగే పైన మరోసారి డిటిపిసి అధికారులతో కేటీఆర్ మాట్లాడారు.
ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం నడుచుకోవాలని, రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని కేటీఆర్ కోరారు.ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దు కు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ చేశారు.ఇదేవిధంగా మిగతా విష్యాలపైనా దృష్టి సారించి కామారెడ్డి లో కెసిఆర్ విజయానికి ఎటువంటి డొఖా లేకుండా చూసుకుంటున్నారు.







