ఏపీలో ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి.
ఒక్కో జిల్లాలో జరిగే పార్టీ సమన్వయ సమావేశాలకు రెండు పార్టీల నుంచి ఒక్కో సీనియర్ నేత హాజరై సమావేశాలను పర్యవేక్షించనున్నారు.ఈ మేరకు ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశంతో పాటు అనంతపురం జిల్లాల్లో సమన్వయ సమావేశాలను నిర్వహించనున్నారు.
రేపు పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరుతో పాటు కడప జిల్లాల్లో సమావేశాలు జరగనుండగా ఎల్లుండి విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు జరగనున్నాయి.







