దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీదారు టీవీఎస్ మోటార్( TVS Motors ) ఈ ఏడాది ప్రీమియం లైఫ్‌స్టైల్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.225 సీసీ బైక్ రొనిన్‌ను లాంచ్ చేయడం ద్వారా అది ప్రీమియం బైక్స్ కోసం చూస్తున్న వారి దృష్టిని తన వైపు తిప్పుకుంది.ఈ బైక్‌లో ఇప్పటికే 3 వేరియంట్లు పరిచయం చేసిన టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు రొనిన్ మోటార్‌సైకిల్( TVS Ronin TD special edition )లో మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది, ఇది నింబస్ గ్రే కలర్ స్కీమ్, కొత్త గ్రాఫిక్‌లతో కూడిన స్పెషల్ ఎడిషన్.ఈ స్పెషల్ ఎడిషన్ ట్రిపుల్ టోన్ డిజైన్‌ను కలిగి ఉంది, ప్రధాన కలర్‌గా గ్రే కలర్, సెకండరీ కలర్‌గా వైట్, యాక్సెంట్ కలర్‌గా రెడ్ ఉన్నాయి.
ట్యాంక్, సైడ్ ప్యానెల్‌పై రెడ్ కలర్ పెయింట్ చేశారు, వీల్ రిమ్‌పై ‘టీవీఎస్ రొనిన్’ అని రాసి ఉంటుంది.హెడ్‌ల్యాంప్ బెజెల్‌తో సహా మోటార్‌సైకిల్ బాటమ్‌లో బ్లాక్ రంగులో ఉంటుంది, ఇది పై భాగానికి కాంట్రాస్ట్‌గా ఉంటుంది.

ప్రత్యేక ఎడిషన్( TVS Ronin TD special edition Features ) యూఎస్‌బీ ఛార్జర్, వైజర్, కొత్త EFI కవర్ వంటి కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్లతో కూడా వస్తుంది.ఈ యాక్సెసరీలు మోటార్‌సైకిల్‌లో ముందే అమర్చబడి ఉంటాయి, కాబట్టి వినియోగదారులు వాటి కోసం ఎక్స్‌ట్రా మనీ చెల్లించాల్సిన అవసరం లేదు.స్పెషల్ ఎడిషన్ దాని టెక్ ఫీచర్స్‌లో ఎలాంటి మార్పులను కలిగి లేదు.ఇది రోనిన్ ఇతర వేరియంట్‌ల వలె సేమ్ 4-వాల్వ్, 225.9cc ఇంజన్‌ని కలిగి ఉంది.ఈ ఇంజన్ గరిష్టంగా 20.4PS పవర్, 19.93Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

రొనిన్ ప్రత్యేక ఎడిషన్ ధర రూ.1,72,700 (ఎక్స్-షోరూమ్)గా( TVS Ronin TD special edition Price ) నిర్ణయించారు.ఇది మిగతా వాటితో పోలిస్తే చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు.ఇది రొనిన్ అత్యంత ఖరీదైన వేరియంట్ కాగా మిగతా వేరియంట్ల ధరలు చూస్తే (ఎక్స్-షోరూమ్) TVS రోనిన్ SS రూ.1,49,200, టీవీఎస్ రొనిన్ డీఎస్ రూ.1,56,700, టీవీఎస్ రోనిన్ TD రూ.1,68,950గా ఉన్నాయి.







