పవన్ కళ్యాణ్ - తరుణ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..?

కొన్ని క్రేజీ కాంబినేషన్ సినిమాలు కొన్ని అనుకోని కారణాల వల్ల మిస్ అవ్వడం చాలా సార్లు జరిగింది.ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ కాంబినేషన్ మిస్ అయ్యింది అని తెలిసిన తర్వాత అభిమానులు ఎలాంటి కాంబినేషన్ ని మిస్ అయ్యామో అని తలచుకొని బాధపడుతూ ఉంటారు.

 Is That The Movie That Was Missed In Pawan Kalyan Tarun Combination , Pawan Kal-TeluguStop.com

అలాంటి క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటి పవన్ కళ్యాణ్ మరియు హీరో తరుణ్ కాంబినేషన్.ఈ ఇద్దరు అప్పట్లో యూత్ లో ఒక సెన్సేషన్ సృష్టించిన సంగతి మన అందరికీ తెలిసిందే.

కానీ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కి ఏర్పడిన కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తరుణ్ కి ఏర్పడలేదు.కొంతకాలం లేడీస్, యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫాలోయింగ్ కొనసాగింది కానీ, మధ్యలో సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేక వరుసగా ఫ్లాప్ సినిమాలను ఎదురుకొని కెరీర్ ని కోల్పోయాడు.

ఆ తర్వాత ఆయన సినిమాలకు దూరమై వ్యాపారం లోకి అడుగుపెట్టాడు.

Telugu Bangaram, Meera Chopra, Pawan Kalyan, Tarun, Tollywood-Movie

వ్యాపార రంగం లో బాగా సంపాదించి హైదరాబాద్ లోనే టాప్ మోస్ట్ ధనవంతులలో ఒకరిగా నిలిచాడు.ఇదంతా పక్కన పెడితే తరుణ్ కి వరుసగా ఫ్లాప్స్ పడుతున్న సమయం లో ఆయనకీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే ఛాన్స్ దక్కింది.2006 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )హీరో గా నటించిన ‘బంగారం’ సినిమా( Bangaram movie ) విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రానికి మొదటి ఆట నుండే అప్పట్లో నెగటివ్ టాక్ వచ్చింది, కానీ కమర్షియల్ గా మాత్రం యావరేజి గా నిల్చింది.అయితే ఈ చిత్రం హీరో రాజా క్యారక్టర్ ఎంత ముఖ్యమైనదో మనకంతా తెలుసు.

రాజా మరియు హీరోయిన్ మీరా చోప్రా ని కలిపే ప్రయత్నం లోనే పవన్ కళ్యాణ్ ప్రారంభం నుండి సినిమా ఎండింగ్ వరకు ఉంటాడు.అయితే హీరో రాజా పాత్ర కోసం ముందుగా తరుణ్ ని అనుకున్నాడట డైరెక్టర్ ధరణి.

Telugu Bangaram, Meera Chopra, Pawan Kalyan, Tarun, Tollywood-Movie

కానీ తరుణ్ హీరో పాత్రలకు తప్పితే ముఖ్యమైన పాత్రలు పోషించే ప్రసక్తే లేదని, హీరో గా ఇండస్ట్రీ లోకి వచ్చాను, హీరో గానే ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోతాను, అవకాశాలు రాకపోయినా పర్లేదు అని అన్నాడట.అలా తరుణ్ ఈ ముఖ్యమైన పాత్ర ని మిస్ అయ్యినట్టు తెలుస్తుంది.కానీ ఈ చిత్రం లో ఆయన నటించి ఉంటే కచ్చితంగా సినిమాకి మరియు ఆయన కెరీర్ కి బాగా ప్లస్ అయ్యేదని విశ్లేషకుల అభిప్రాయం.పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ థియేటర్స్ లో నడుస్తున్న సమయం లో విడుదలైన బంగారం చిత్రం( Bangaram movie ) అప్పట్లో ఫ్లాప్ తో 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube