బిగ్ బాస్ హౌస్‌లో ఎవరికి రానంత నెగిటివిటీ ఒకే కంటెస్టెంట్ కి వచ్చింది.అది మరెవరో కాదు టీవీ నటి శోభా శెట్టి( Shobha Shetty )ఈ ముద్దుగుమ్మను శివాజీ నుంచి మీడియా వరకు అందరూ టార్గెట్ చేస్తున్నారు.
సైకో శోభా అంటూ ఆమెను మరింత నెగిటివ్ కోణంలో ప్రజెంట్ చేసేలా మీడియా కథనాలు వండి వార్చుతోంది.గత వారమే శోభా శెట్టి ఇంటికి వెళ్లి పోవాల్సి ఉందని కానీ దురదృష్టవశాత్తుగా నయని పావని వెళ్ళిపోయింది అంటూ మీడియా వర్గాలు కొడై కుశాయి.
ఈసారి కూడా ఆమె ఎవిక్షన్ తప్పనిసరి అన్నట్లు కథనాలు వచ్చాయి.కానీ ఏమయింది వేరే వారు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

శోభా శెట్టి డేంజర్ జోన్ లో ఉన్న బతికి పోవడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి.వాటిలో ఒకటి ఆమె బిగ్ బాస్ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకోవడం కావచ్చు.ఇంకొకటి హౌస్ లో ఆమె పెర్ఫార్మెన్స్.శివాజీ బ్యాచ్( Shivaji )ను ఆమె సింగిల్ హ్యాండ్ తో ఎదుర్కొంటోంది.ఆమె టెంపర్ బిగ్ బాస్ హౌస్ కి బాగా అవసరం.శివాజీ( Shivaji ) లాంటివారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే కంటెస్టెంట్ హౌస్ లో ఉన్నది ఆమె ఒక్కరే.
ఆమె ఒకేసారి ఏడుస్తుంది, మరుక్షణమే ఎవరు ఫేస్ చేయలేనంత ఫైట్ చేస్తుంది. టాస్కులలో ఎవరూ చూపించని పోరాట ప్రతిమను చూపిస్తుంది.100% ఎఫెక్ట్స్ పెట్టి టాస్కుల్లో విజయం సాధించడానికి ట్రై చేస్తుంది.ఈ లక్షణాలన్నిటిని పరిగణలోకి తీసుకొని బిగ్ బాస్ ఆమెను కావాలనే బయటికి పంపించడం లేదనే అభిప్రాయం చాలామందిలో ఉంది.

విశ్వసనీయ వర్గాల ప్రకారము శోభా శెట్టి ఆట సందీప్ ఇద్దరూ కూడా డేంజర్ లో ఉన్నారు.వారిలో శోభా శెట్టి సేఫ్ కాగా ఆట సందీప్ ( Aata sandeep )బయటికి వెళ్లిపోయాడు.ఏడు వారాలపాటు వరుసగా లేడీ కంటెస్టెంట్లు వెళ్లిపోతుండగా ఈసారి మేల్ కంటెస్టెంట్ వెళ్లిపోయాడు.ఓట్లలో శోభాతో పోటీపడి అతడు ఓడిపోయాడు.శోభా ఈ ఎలిమినేషన్స్ లో మాత్రమే కాదు హౌస్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ పై తనదైన శైలిలో విజయం సాధిస్తుంది, అది వాగ్వాదాలలోనైనా ఇంకా ఎలాంటి పోటీల్లోనైనా.రీసెంట్ గా ప్రిన్స్ యావర్ కెప్టెన్సీ ఫైనలైజ్ చేసే సమయంలో శోభా పై పిచ్చిపిచ్చిగా అరిచేసాడు.
ఆ సమయంలో శోభా కొంచెం కూడా సహనం కోల్పోకుండా అతడికి ఒక గట్టి సవాల్ విసిరింది.ఇప్పట్లో తనని హౌజ్ నుంచి ఎవరూ వెళ్లగొట్టలేరని కూడా ఆమె మాట జారింది.
దీన్ని బట్టి డీల్ కుదుర్చుకుందేమో అనే అనుమానం కలుగుతుంది.







